Site icon Prime9

Natu Natu Song : అరుదైన ఘనత సాధించిన తెలుగు సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ.. ఆస్కార్ వేదికపై “నాటు నాటు”

rahul sipligun and kaala bhairava live performance of natu natu song in oscars

rahul sipligun and kaala bhairava live performance of natu natu song in oscars

Natu Natu Song : భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో “ఆర్ఆర్ఆర్” కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అలియా భట్‌, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా.. అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్‌ లోనూ ఈ సినిమాకి అభిమానులు బ్రహ్మరధం పడుతున్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ – అల్లూరి సీతా రామరాజుగా, ఎన్టీఆర్ – కొమరం భీమ్ గా నటించారు. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది అవుతున్న ఈ మూవీ మానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. వరల్డ్ వైడ్ గా ఎన్నో ఇంటర్నేషనల్ వేదికల్లో చోటు దక్కించుకోవడమే కాకుండా అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ ఇండియన్ సినిమాను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ వెళుతుంది ఆర్ఆర్ఆర్. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది. ఈ పీరియాడికల్ డ్రామా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టగా.. వాటిలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు కూడా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రాన్ని మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ అవార్డులలో ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ అవార్డుల పంట పండించింది. ఏకంగా 5 కేటగిరీల్లో అవార్డులను కైవసం చేసుకుంది.

 

ముఖ్యంగా ఈ సినిమాకి ఇతర దేశాల్లో కూడా ఎక్కువ అవార్డులను తెచ్చిపెట్టింది ఈ చిత్రం లోని ‘నాటు నాటు’ పాట అనే చెప్పాలి. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడిన ఈ పాట.. ఖండాంతరాలు దాటి ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఇక ఇప్పటికే ఈ పాట ఆస్కార్ బరిలో కూడా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ రోజు ఈ పాటని లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నట్లు అకాడమీ తమ సోషల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మార్చి 12న జరిగే 95వ అకాడమీ అవార్డ్స్ లో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుండడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం అని చెప్పాలి. దీంతో రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవకి పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

 

కాగా నేడు (మార్చి 1) లాస్ ఏంజెల్స్ లో 1647 లార్జెస్ట్ సీటింగ్ ఉన్న ఏస్ హోటల్ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ జరగనుంది. ఈ స్క్రీనింగ్ కి రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ హాజరవ్వనున్నారు. స్క్రీనింగ్ అనంతరం ఆడియన్స్ తో చిట్ చాట్ నిర్వహించనున్నారు. తారకరత్న పెదకర్మ మార్చి 2న ముగియనుంది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మార్చి 6న ఎన్టీఆర్ అమెరికా బయలదేరనున్నారని సమాచారం.

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version