Site icon Prime9

Pushpa 2: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రీలోడెడ్‌ వెర్షన్‌ గ్లింప్స్‌ రీలీజ్‌ – మేకర్స్‌ ప్లాన్‌ మామూలుగా లేదుగా..

Pushpa 2 Reloaded Version Telugu Glimpse: అల్లు అర్జున్‌ పుష్ప 2 విడుదలై నెల దాటింది. ఇప్పటికీ థియటర్లో ఈ సినిమా సక్సెస్‌ ఫుల్‌గా ఆడుతోంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతుండటంతో వాటికి ధీటుగా పుష్ప 2 రీలోడెడ్‌ వెర్షన్‌ తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా కేజీయఫ్‌ 2, ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి 2 చిత్రాలు రికార్డు బ్రేక్‌ చేసి దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్న దంగల్‌ రికార్డు దిశగా పరుగులు పెడుతుంది.

ఇందులో కోసం మేకర్స్‌ బిగ్‌ప్లాన్‌తో వస్తున్నారు. పుష్ప 2కి రీలోడెడ్‌ వెర్షన్‌ అంటూ 20 నిమిషాలు నిడివి అదనంగా చేర్చబోతున్నారు. మొదటి రీలోడెడ్‌ వెర్షన్ జనవరి 11న థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ తర్వాత టెక్నికల్‌ ఇష్యూస్‌ కారణంగా జనవరి 17కు వాయిదా వేశారు. ఇటీవల ఈ విషయాన్ని మూవీ టీం స్పష్టం చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో రీలోడెడ్‌ వెర్షన్‌ రానుండటంతో తాజాగా మేకర్స్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఇందులో పుష్పరాజ్‌ జాతర చూపించారు. రీలోడెడ్‌ వెర్షన్‌ గ్లింప్స్‌ పేరుతో 25 సెకన్ల నిడివితో వీడియో వదిలారు. ఇందులో జపాన్‌ ఎపిసోడ్‌ ఎక్కువగా చూపించారు.

డైనింగ్‌ టెబుల్‌ వద్ద సిండికేట్‌ సభ్యులతో సమావేశం అయినట్టు ఉన్న ఈ సీన్‌లో పుష్పరాజ్‌ క్లైమాక్స్ ఫైట్‌లో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వడం హైప్‌ ఇస్తుంది. ఈ లేటెస్ట్‌ గ్లింప్స్‌ మేకర్స్‌ రీలోడెడ్‌ వెర్షన్‌పై అంచనాల పెంచింది. మరి జనవరి 17న వస్తున్న పుష్ప ఈ రీలోడెడ్ వెర్షన్‌ థియేటర్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. గతేడాది డిసెంబర్‌ 5న పుష్ప 2 వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందకు వచ్చింది. మొదటి రోజు ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ ఒపెనింగ్‌ని ఇచ్చింది. రూ. 290 కోట్ల గ్రాస్‌ చేసి రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి పుష్ప 2 రికార్స్‌ మీద రికార్స్‌ బ్రేక్‌ చేస్తూ వెళుతుంది.

ఈ సినిమా ప్రస్తుతం రూ. 1840పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లతో దూసుకుపోతుంది. హిందీలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటి వరకు హిందీ పుష్ప ఈ వసూళ్లు చూస్తే రూ. 968.95 కోట్ల గ్రాస్‌, రూ. 821 కోట్ల నెట్‌గా ఉంది. ఒక్క దెబ్బతో బన్నీ బాలీవుడ్‌ ఖాన్‌ రికార్డులతో తుడిచిపెట్టడమే కాదు, అక్కడ సౌత్‌ సినిమా స్థాయిని పెంచింది. ఇప్పటికే ఏ సినిమాకు రానీ కలెక్షన్స్‌ ఓ సౌత్ ఇండియా డబ్బింగ్‌ సినిమా చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అది అతితక్కువ టైంలో కలెక్షన్స్‌ చేయడం విశేషం. దీంతో హిందీ బెల్ట్‌లో అల్లు అర్జున్‌ క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థమైపోతుంది. మరి ఈ రీలోడెడ్‌ వెర్షన్‌ హిందీలో ఇంకేన్ని సంచలనాలు చేస్తుందో అని బాలీవుడ్ సినీవర్గాలతో పాటు మూవీ విశ్లేషకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version