Site icon Prime9

Prince Trailer Review : శివకార్తీకేయన్ ” ప్రిన్స్ ” సినిమా ట్రైలర్ అదిరిందిగా !

prince movie OTT release prime9news

prince movie OTT release prime9news

Prince Trailer Review : జాతి రత్నాలు ఫేం డైరెక్టర్ అనుదీప్‌ సినిమాల్లో ఉండే ఫన్‌ ఎలిమెంట్స్‌…మిగిలిన ఏ సినిమాల్లో కనిపించవు.ఇదేదో వింత విషయం అని చెప్పడం లేదు కానీ..అనుదీప్‌ రైటింగ్‌లో ఆ టైమింగ్ అలా ఉంటుంది. చిన్న చిన్న డైలాగ్‌లు, పంచ్‌లు తన స్పెషలిటీ.ఇలాంటి సీన్స్‌తో రాసుకున్న సినిమానే ‘జాతిరత్నాలు’.ఆ సినిమా తర్వాత అనుదీప్‌ నేరుగా తమిళనాడు వెళ్లి అక్కడ మోస్ట్‌ ప్రామిసింగ్ హీరో శివకార్తికేయన్‌తో ఓ సినిమా ‘ప్రిన్స్‌’ చేశాడు.ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది.అది ఎలా ఉందో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

కులం, మతం అంటూ ఎప్పుడూ గొడవలు పడే ఊళ్లో హీరో శివకార్తికేయన్‌ స్కూలు టీచరగా పని చేస్తుంటాడు.పిల్లలకు స్లిప్‌లు, బుక్స్‌ ఇచ్చి పరీక్షలు రాయిస్తుంటాడు.ఐతే దాని పెద్ద హిస్టరీనే ఉంది.అలా సాగుతున్న అతని జీవితంలో విదేశీ అమ్మాయి వస్తుంది.కులం, మతం, వర్గం అని కొట్టుకునే ఊరు…హీరో చేసిన పనితో అంతర్జాతీయ వ్యవహారంలా మారిపోతుంది.
ఈ సినిమాలో దేశీ అమ్మాయిని ప్రేమించాననేది హీరో ఒక లాజికల్ గా చెబుతాడు.దీనికి కొంతమంది కన్విన్స్‌ అయితే..ఇంకొంతమంది కన్‌ఫ్యూజ్‌ అవుతారు. ” కులం, మతం కోసం ఇంకా గొడవలు పడుతున్నారు ? మ‌నంద‌రికీ ఒక‌టే ర‌క్తం రా ” అని సత్యరాజ్ అనడంతో దాంతోపాటు ‘నీ రక్తం ఏం రంగు రా’ అని మరొకరిని అడిగితే.. ‘నా బ్లడ్‌ కొంచం పింక్‌ కలర్‌లో ఉంది’ అంటూ రివర్స్ కౌంటర్‌ పడుతుంది.. అలా మొదలయ్యి పంచ్ డైలాగ్స్ తో ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది.దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version