Site icon Prime9

Hanuman Movie : ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ “హను మాన్” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

prashanth varma hanuman movie release date fixed

prashanth varma hanuman movie release date fixed

Hanuman Movie : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో విభిన్న తరహాలో కొత్త కథలను ప్రేక్షకులకు అందిస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు. ప్రస్తుతం యువహీరో ‘తేజ సజ్జ’తో ‘హనుమాన్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించగా.. కథానాయికగా అమృత అయ్యర్ నటిస్తుంది. మరో కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుండడం విశేషం అని చెప్పాలి. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తున్నట్టు సమాచారం అందుతుంది.

చిన్న సినిమాగా ఈ చిత్రాన్ని భవించినప్పటికి.. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా టీజర్.. ఆడియన్స్ లో అంచనాలను భారీగా పెంచేసింది. అదే సమయానికి వచ్చిన ఆదిపురుష్ VFX మీద ట్రోల్స్ రావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. ఆదిపురుష్ కంటే ఈ సినిమా గ్రాఫిక్స్ బాగుందని ఆడియన్స్ అంతా ఫీల్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. వీ ఎఫ్ ఎక్స్ కారణంగా మరింత ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్ .

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024 రాబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇప్పటికే సంక్రాంతికి ప్రభాస్ ప్రాజెక్ట్ K, మహేష్ గుంటూరు కారం, రవితేజ ఈగల్ సినిమాలు బరిలో ఉన్నాయి. స్టార్ హీరోల మధ్య సినిమాని రిలీజ్ చేసి ఈ యంగ్ డైరెక్టర్ హిట్ కోడతాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

Exit mobile version