Site icon Prime9

Unstoppable 2: బాలయ్య టాక్ షో కు ప్రభాస్

Prabhas

Prabhas

Tollywood News: రెబెల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాల బిజీగా ఉన్నాడు. అతను పలు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాలన్నీ ఏడాదికాలంలో విడుదలకు సిద్దమవుతాయి. తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ 2 యొక్క తదుపరి ఎపిసోడ్‌లో ప్రభాస్ కనిపిస్తాడని టాక్ .ఇది నిజమైతే, బాలయ్య మరియు ప్రభాస్‌ల సంభాషణలను చూడటం అభిమానులకు మంచి కిక్ ఇచ్చే అంశమే.

వచ్చే వారం ఎపిసోడ్‌ షూటింగ్‌ జరగనుంది. చిరంజీవి, వెంకటేష్ మరియు పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుల పేర్లపై ఊహాగానాలు ఉన్నప్పటికీ, రెండవ సీజన్‌లో వారెవరూ రాలేదు. ఈ సీజన్ తెలుగు సినిమా మరియు రాజకీయ ప్రముఖుల కలయికగా సాగుతోంది.సీజన్ చివరి ఎపిసోడ్‌కు పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ ప్రత్యేక అతిధులుగా ఉంటారని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాన్నిసంక్రాంతికి విడుదల చేయనున్నారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ యొక్క సాలార్ మరియు మారుతి యొక్క పేరు పెట్టని చిత్రాల షూటింగ్ లో ఉన్నాడు.

Exit mobile version