Site icon Prime9

Unstoppable 2 : బాలకృష్ణ అన్ స్టాపబుల్ లోప్రభాస్ సీక్రెట్ రివీల్… చిరాకు వస్తే ఏం చేస్తాడో చెప్పిన గోపిచంద్

prabhas secret revealed by gopichand in balakrishna unstoppable show

prabhas secret revealed by gopichand in balakrishna unstoppable show

Unstoppable 2 : నందమూరి బాల కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో లో ప్రభాస్ పాల్గొన్న విషయం తెలిసిందే. గతవారం ప్రభాస్ పెళ్లి విషయం మీద రామ్ చరణ్ ఫోన్ సంభాషణ ఎపిసోడ్ కి హై లైట్ గా నిలవగా రెండవ ఎపిసోడ్ కి హీరో గోపి చంద్ స్వయంగా ప్రభాస్ తో కలిసి పాల్గొన్నాడు.

బాలకృష్ణ ప్రశ్నలకు సరదాగా సమాధానం ఇచ్చారు ప్రభాస్, గోపి చంద్. ఈ ఎపిసోడ్ లో కూడా బాలయ్య గోపి చంద్ ని ప్రభాస్ పెళ్లి గురించి అడిగితే వచ్చే సంవత్సరం ఉంటుంది అని చెప్పాడు గోపి చంద్. దీనితో ఆ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెడుతూ గోపి చాంద్ కి ఒక సినిమా పేరు ఇచ్చాడు బాలయ్య. “రామ బాణం” అనే టైటిల్ ఇచ్చి దాని వంద రోజుల ఫంక్షన్ కి నేనే వస్తా అని గోపి చాంద్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు బాలయ్య.

చిరాకు వస్తే గోపి ఏం చేస్తాడు అని అడిగితే తనకి చిరాకు రాదు మంచోడు అని ప్రభాస్ చెప్పాడు. మరి ప్రభాస్ కి చిరాకు వస్తే ఏం చేస్తాడు అని అడిగితే అందరిని పొమ్మని ఒక్కడే కూర్చుని సిగరెట్ కాలుస్తాడు అన్నట్టు చేతితో సైగ చేసాడు, 2008 లో ఎవరో హీరోయిన్ కోసం గొడవ పడ్డారట కదా అని బాలయ్య అడిగిన ప్రశ్నకి అది 2008 కాదు 2004 లో వర్షం సినిమాలో త్రిష కోసం అని తెలివిగా తప్పించాడు గోపి చంద్.

Exit mobile version
Skip to toolbar