Site icon Prime9

Prabhas : ప్రభాస్ , మారుతి మూవీ నుంచి లీక్డ్ పిక్స్ వైరల్.. ఆ హీరోయిన్ తో ప్రభాస్ భలే ఉన్నాడుగా !

prabhas and maruthi film leaked pics goes viral

prabhas and maruthi film leaked pics goes viral

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమా లైన‌ప్ చూస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం. ప్ర‌భాస్ ఇప్పుడు … ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’, మారుతి దర్శకత్వంలో చిత్రాలు చేస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ మారుతీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంచ్ కాకపోయినా సైలెంట్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటుంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఒక పాత థియేటర్ సెట్ కూడా వేయించినట్లు తెలుస్తుంది.

ఈ చిత్రానికి రాజా డీలక్స్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. కాగా ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణల వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రాధే శ్యామ్ ఫేమ్ రిద్ది కుమార్  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఫోటో లీక్ అయ్యింది.

రాధే శ్యామ్ బ్యూటీ తో ప్రభాస్ (Prabhas)..

ఆ ఫొటోలో ప్రభాస్, రిద్ది జంటగా కనిపిస్తున్నారు. ఇక ప్రభాస్ అయితే గుబురు గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ ని చూసిన రెబల్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎటువంటి హడావుడి లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ ని అందించేలా ఉన్నాడు అంటూ మారుతీని పొగిడేస్తున్నారు. గతంలో కూడా ఈ మూవీ నుంచి కొన్ని పిక్స్ లీక్ అయ్యి ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ఎటువంటి ప్రమోషన్స్ అండ్ ప్రకటన చేయనప్పటికీ, ఈ లీక్ పిక్స్ సినిమా పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

 

మరోవైపు ప్రభాస్.. సలార్‌తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ’ప్రాజెక్ట్ K’ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రీసెంట్‌గా ప్రారంభమైంది. అంతేకాదు అమితాబ్, ప్రభాస్ లపై మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. మన దేశంలోనే ఈ సినిమా అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కనుంది. ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రభాస్ అంతే రితీగా డేట్స్ కేటాయించినట్లు తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 200 రోజలును కేటాయించాడని సమాచారం. ప్రాజెక్ట్ K దాదాపు 90% షూట్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందని తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేసారు. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు.

Exit mobile version