Prabhas Fauji Latest Schedule Update: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోగా ఉన్నాడు ప్రభాస్. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు, భారీ హిట్స్‌తో ప్రభాస్ కెరీర్ ఫుల్ స్వీంగ్‌లో ఉంది. ప్రస్తుతం అతడి చేతిలో సలార్ 2, కల్కి 2, ఫౌజీ, స్పిరిట్, ది రాజాసాబ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండ మరిన్ని చర్చల దశలో ఉన్నాయి. అవన్ని కూడా మోస్ట్ అవైయిటెడ్ సినిమాలే కావడంతో ప్రభాస్ మార్కెట్ ఓ రేంజ్‌లో ఉంది.
అయితే ప్రస్తుతం ప్రభాస్ మాత్రం ‘ఫౌజీ’, ది రాజా సాబ్ షూటింగ్’ పూర్తి చేయడంపై ఫుల్ ఫోకస్‌గా ఉన్నాడు. ఇటీవల సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన అతడు త్వరలో తిరిగి ఇండియా రాబోతున్నాడు. వచ్చ రాగానే హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్ సెట్‌లో తిరిగి అడుపెట్టబోతున్నాడట. ప్రభాస్ రాక కోసం వెయిట్ చేస్తున్న ఫౌజీ టీం భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. బ్రేక్ లేకండ రెండు నెలల పాటు ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్టు ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. అంటే మార్చి చివరి వరకు ఫౌజీ షూటింగ్ కంటిన్యూగా కొనసాగనుంని తెలుస్తోంది. గతేడాది ఆగష్టు ఈ మూవీని లాంచ్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజల్లోనే షూటింగ్ మొదలుపెట్టారు.
కాగా ఈ సినిమా సెట్‌లోనే ప్రభాస్ గాలికి గాయమైనట్టు తెలుస్తోంది. ఈ గాయం కారణంగానే డార్లింగ్స్ విదేశాలకు సర్జరీ కోసం వెళ్లాడు. ఇప్పుడు తిరిగి రాగానే ఈ మూవీ షూటింగ్ సెట్‌లో మరోసారి సందడి చేయబోతున్నాడు. దీనితో పాటు ది రాజా సాబ్ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా సీతారామం ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సోషల్ మీడియా స్టార్ ఇమాన్నీ ఇస్మాయిల్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నవిన్ యర్నేనీ, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.