Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజిబిజీగా ఉన్నాడు. చేతిలో వరుసగా 5,6 సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ఆదిపురుష్“. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ గా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటి.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది. అంతకు ముందు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు.. వీఎఫ్ఎక్స్ పై భారీగా ట్రోలింగ్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీ తో పాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేశారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలన్నింటినీ మార్చేసింది. ట్రైలర్ లో.. అహంకారపు రొమ్ము చీల్చడానికి దూకండి ముందుకి, నా ప్రాణం సీతలోనే ఉంది.. నాకు ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రిమయమైనది అని ప్రభాస్ చెప్పిన డైలాగ్లు గూస్ బంప్స్ తెప్పించాయి. ముఖ్యంగా ట్రైలర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టింది. జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అనే చాంటింగ్ వస్తుంటే.. రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అనే చెప్పాలి.
ఆ పోస్టర్స్ లో మైనస్ అదేనా (Adipurush)..
అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో.. మూవీ ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు. ఈ మేరకు తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్స్ విషయంలో మళ్ళీ మూవీ యూనిట్ ట్రోలింగ్ కి గురవుతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్స్ ని గమనిస్తే.. ప్రస్తుత కాలంలో ఉన్నట్టు ఎత్తైన భవనాలు కనిపిస్తున్నాయి. రామాయణ కాలం ప్రకారం ఆ సన్నివేశంలో ఈ విధంగా భవనాలు ఉండడం అనేది సాధ్యం కానీ విషయం. ఈ కారణంగా మళ్ళీ ఇప్పుడు నెటిజన్లు అంతా మూవీ యూనిట్ ని ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. దాంతో ఆదిపురుష్ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది.
ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’.. నాగ్ అశ్విన్ తో ‘ప్రాజెక్ట్ కె’.. సందీప్ రెడ్డి వంగా తో ‘స్పిరిట్’, మారుతితో “రాజా డీలక్స్” సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే మరో మూవీ షెడ్యూల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం ప్రభాస్ మారుతీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంచ్ కాకపోయినా సైలెంట్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకుంటుంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు సమాచారం.