Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కలిసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటైన గబ్బర్ సింగ్‌ను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై రవి శంకర్ నిర్మిస్తున్న మరో ప్రత్యేక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్‌తో ఈ బ్లాక్‌బస్టర్ కాంబో తిరిగి వచ్చింది.
సెప్టెంబర్ 5 నుంచి..(Ustaad Bhagat Singh)
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ పవర్ స్టార్ అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. అదేమిటంటే ఈ సినిమా భారీ షెడ్యూల్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. సుదీర్ఘమైన ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు మరికొందరు పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి మరియు అతని బృందం భారీ సెట్‌ను నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్. అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. యాక్షన్ సన్నివేశాలకు స్టంట్ డైరెక్టర్ ద్వయం రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్, గౌతమితో పాటు నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని 2024 వేసవికి ముందు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం.