Site icon Prime9

Poonam Kour : అందరి ముందు కన్నీళ్ళు పెట్టుకున్న నటి పూనమ్ కౌర్..

poonam-kour-emotional-on-womens-day-celebrations

poonam-kour-emotional-on-womens-day-celebrations

Poonam Kour : ప్రముఖ నట పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే కూడా ఎక్కువ వివాదాల తోనే పూనమ్ కి క్రేజ్ వచ్చింది అని చెప్పాలి.  టాలీవుడ్ తోనే తన కేరీర్ ను ప్రారంభించిన నటి పూనమ్ కౌర్.. అటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. కొన్నేండ్లు తెలుగులో పూనమ్ కౌర్ హీరోయిన్ గా కాకుండా ముఖ్య పాత్రల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణలోని రాజ్ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా వేదికపై మహిళా దినోత్సవంపై తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ఈ క్రమంలో వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు నటి పూనమ్ కౌర్.. ఆమె మాట్లాడుతూ.. తాను తెలంగాణ బిడ్డనేనని, కానీ తనను పంజాబీ అమ్మాయి అంటూ దూరం పెడుతున్నారంటూ వేదికపై కన్నీళ్లు పెట్టుకుంది. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేనూ తెలంగాణ బిడ్డనే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

దయచేసి మైనార్టీ అని, సిక్కు అని వేరు చేయొద్దంటూ భావోద్వేగమయ్యారు. అలాగే మెడికల్ స్టూడెంట్ ప్రీతీ ఘటనపైనా స్పందించారు. ఆమెకు జరిగింది అన్యాయమని.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాజ్ భవన్ లోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక పూనమ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా పోస్టులు పెడుతూ నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటారు.

సినిమాల విషయానికొస్తే పూనమ్ కౌర్ కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. తెలుగుతో పాటు అటు హిందీ లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందడం కష్టమైంది. దీంతో వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటోంది. గతేడాది తెలుగులో ‘నాతిచరామి’ చిత్రంతో అలరించింది. ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న సమయంలో.. పూనమ్ కౌర్ ఆయనతో కలసి కొంత దూరం పాటు పాల్గొనడం తెలిసిందే.

మరోవైపు హీరోయిన్ పూనమ్ కౌర్ ‘ఫైబ్రోమయాల్జియా’ అనే వింత వ్యాధితో బాధ పడుతున్నానని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనికి ఆమె కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ తగ్గకపోవడంతో ఆమె కేరళ ఆయుర్వేద వైద్యాన్ని అశ్రయించినట్టు వెల్లడైంది. తాను చికిత్స పొందుతున్న ఫోటోలను పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని, నిద్ర లేమి, త్వరగా అలసిపోవడం, కండరాల నొప్పి, మానసిక ఒత్తిడి వంటి రుగ్మతలు సోకుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పూనమ్ కౌర్ సుమారు రెండేళ్లుగా ఈ వ్యాధితో బాధ పడుతున్నట్టు సమాచారం. తగిన మందులు వాడుతూ, మానసిక ప్రశాంతతను పొందుతూ..క్రమం తప్పకుండా యోగా చేసిన పక్షంలో ఈ వ్యాధి నయమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version