Site icon Prime9

Ponniyin Selvan 2 : ఏప్రిల్ 28 న వస్తున్న పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2

Part 2

Part 2

Ponniyin Selvan 2:మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మంచి విజయాన్ని అందుకుంది. దీనితో ఇప్పుడు అందరి దృష్టి ఈ చిత్రం రెండవ భాగంపై ఉంది. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2 ఏప్రిల్ 28, 2023న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

పొన్నియిన్ సెల్వన్ యొక్క మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మంచి వసూళ్లను సాధిస్తోంది.ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2 పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా వేసవి సెలవుల్లో ఏప్రిల్ 28, 2023న విడుదలయ్యే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్‌లో పొన్నియిన్ సెల్వన్ విడుదల కానుంది. పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 ప్రమోషన్స్ సందర్భంగా, మణిరత్నంమొదటి భాగం విడుదలైన ఆరు నుండి తొమ్మిది నెలల తర్వాత రెండవ భాగాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

పొన్నియిన్ సెల్వన్ కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రసిద్ధ తమిళ సాహిత్య నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, కార్తీ మరియు జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ సమకూర్చారు.

Exit mobile version