Site icon Prime9

Molestation: నటిపై లైంగిక వేధింపులు – ప్రముఖ నటుడు అరెస్ట్‌

Tv Actor Charith Balappa Arrested: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు బాలప్పను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బాధిత నటి 2017 నుంచి కన్నడ, తెలుగు సీరియల్లో నటిస్తుంది.

ఈ క్రమంలో ఆమెకు 2023 నుంచి బాలప్పతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నిహితం కూడా పెరిగింది. ఈ క్రమంలో తనని పెళ్లి చేసుకోవాలని, శారీరక సంబంధం పెట్టుకోవాలని బలప్ప ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాదు తరచూ తనని డబ్బులు డిమాండ్‌ చేశారని, తన ఆర్థిక అవసరాలు తీర్చకుంటే తన ప్రైవేట్‌ వీడియోలు, ఫోటోలు ఇంటర్నేట్‌, వాట్సప్‌ గ్రూపుల్లో పెడతానంటూ తరచూ బెదిరింపులకు దిగాడు.

అంతేకాదు ఆమె లొంగదీసుకోవడానికి రాజకీయాల అండ కూడా తీసుకున్నాడట. దీంతో బాధిత నటి పోలీసులను ఆశ్రయించింది. చరిత బాలప్ప తనని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని అతడిపై ఫిర్యాదు చేసింది. అంతేకాదు అతడి వల్ల తనకు ప్రాణాహాని కూడా ఉందని ఆరోపించింది. తనను లొంగదీసుకోవడానికి బాలప్ప రాజకీయ నాయకులు, రౌడీ షీటర్ల ఉన్న సంబంధాలను ఉపయోగించుకున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన డిమాండ్లను నెరవేర్చకుంటే చంపి జైలుకు వెళతానని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు చరిత బాలప్పపై కేసు నమోదు అరెస్ట్‌ చేశారు.

Exit mobile version