Site icon Prime9

Tholiprema Re Release : పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ “తొలి ప్రేమ” రీ రిలీజ్ కి రెడీ..

pawan kalyan tholi prema movie ready for re release

pawan kalyan tholi prema movie ready for re release

Tholiprema Re Release : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ లలో “తొలిప్రేమ” కూడా ఒకటి. క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 1998లో రిలీజైన ఈ మూవీ ప‌లు అవార్డుల‌తో పాటు రివార్డుల‌ను అందుకున్న‌ది. ఇందులో ప‌వ‌న్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్‌గా న‌టించింది. తొలి ప్రేమ సినిమాకు దేవా సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలోని పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించాయి. 1998 ఏడాదికిగాను బెస్ట్ తెలుగు మూవీగా తొలి ప్రేమ నేష‌న‌ల్ అవార్డును అందుకున్న‌ది. ఆరు నంది అవార్డుల‌ను ద‌క్కించుకొంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ వారానికి ఒక‌టి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాయి. ఈ ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్‌స్టోరీ మ‌రో సారి థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. తొలి ప్రేమ సినిమాను జూన్ 30న రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. తొలిప్రేమ (Tholiprema Re Release) రిలీజై ఇర‌వై ఐదేళ్లు గ‌డిచినా ఈ సినిమాపై యూత్‌లో ఉన్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 4కే టెక్నాల‌జీలో తొలిప్రేమ‌ను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లో భారీగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేసేలా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తోన్న‌ట్లు స‌మాచారం. తొలి ప్రేమ సినిమాలో సిన్సియ‌ర్ ల‌వ‌ర్‌గా ప‌వ‌న్ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. కాగా రీ రిలీజ్ సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి, జ‌ల్సా సినిమాలు అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఆ జోష్‌ను తొలి ప్రేమ కూడా కంటిన్యూ చేసే అవ‌కాశం ఉంద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ భావిస్తోన్నారు.

కాగా రీరిలీజ్​ సినిమాల్లో పవన్ కళ్యాణ్ మూవీస్ ఆల్​టైమ్​ రికార్డులు క్రియేట్​ చేస్తున్నాయి. పవన్​ నటించిన జల్సా, ఖుషి సినిమాలు భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టించాయి. ఖుషి సినిమా ఏకంగా 7 కోట్ల 80 లక్షలు కలెక్ట్​ చేసి ఆల్​టైమ్​ రికార్డ్​ సెట్​ చేసింది. ఈ రికార్డుని కొల్లగొట్టడానికి చాలా రీ రిలీజ్ లు వచ్చాయి. ఇటీవల విడుదలైన సింహాద్రి కూడా ఖుషి కలెక్షన్లను అందుకోవడం లో విఫలం అయ్యింది. ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి మరోసారి పవన్ మూవీ రాబోతుందని అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు.

 

Exit mobile version