Pawan Kalyan Mourns His Guru Shihan Hussaini Death: నటుడు, తన మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ గురువు షిహాన్ హుస్సైనీ మరణంపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మరణవార్త తనని ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యలాయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన.
“ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు షిహాన్ హుస్సైనీ గారిన మరణవార్త నన్ను తీవ్రంగా బాధించింది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా మూడు వేల మందికి పైగా కరాటేలో బ్లాక్‌బెల్ట్ శిక్షణ అందించడమే కాకుండా, తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడంలో ఆయన సేవలు మరువలేనివి. ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా “హుస్పైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల క్రితమే తెలిసిందని, దీంతో చెన్నైలోని తన మిత్రుల ద్వారా ఆయన ఆరోగ్యంపై వాకబు చేసినట్టు చెప్పారు. విదేశాలకు పంపించి ఆయనకు మెరుగైన వైద్యం చేయించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు. అంతేకాదు ఈ నెల 29న హుస్పైనీ గారిని కలిసి పరామర్శించాలని నిర్ణయించుకున్నానని, అంతలోనే ఈ దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ శిక్షకులు, నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన గురువు షిహాన్ హుస్సైనీ గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. బహుముఖ ప్రజ్ఞాశాలిగా 3 వేల మందికి పైగా కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ అందించడమే కాకుండా, తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించడంలో ఆయన సేవలు మరువలేనివి. ఆయన… pic.twitter.com/GMZYqqqv8Q
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 25, 2025
అలాగే “చెన్నూలో హుస్సైనీ గారు కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని. తొలుత ఆయన కరాటే నేర్పుందుకు ఒప్పుకోలేదు. ‘ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు. కుదరదు’ అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారు. తెల్లవారుజామునే వెల్లి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో హీరో పాత్రకి కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుస్సైనీ గారి శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుస్సైనీ గారు తమిళనాడులో ఆర్ఛరీ క్రిడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీలో అసోసియేషన్‌లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు” అని పవన్ పేర్కొన్నారు.