Prime9

Pawan Kalyan – MM Keeravani: కీరవాణిని సన్మానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌.. ఆస్కార్‌ అవార్డు చూసి ఎలా మురిపోయాడో చూడండి..!

Pawan Kalyan Felicitates MM Keeravani on Oscar Award: ఏపీ డిప్యూటీ సీఎం, పవన్‌ స్టార్ పవన్‌ కళ్యాన్‌ ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఎమ్‌ఎమ్ కీరవాణిని సన్మానించారు. మన మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు పవన్‌. పవన్‌ కళ్యాన్‌ లీడ్‌ రోల్లో నటించిన లేటెస్ట్‌ హిస్టారికల్‌ మూవీ హరిహర వీరమల్లు. క్రిష్‌ జాగర్లమూడి, ఏఏం జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించిన ఈ సినిమా కీరవాణి సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

 

ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. ఇక రేపు ఈ మూవీ నుంచి థర్డ్‌ సింగిల్‌ రాబోతోంది. టైటిల్‌ పాత్రలో సాగే ఈ పాట వీరమల్లు పౌరుషాన్ని తెలియజేసేలా చాలా పవర్ఫుల్‌గా సాగనుందట. ఈ పాట పవన్‌ను చాలా బాగా నచ్చింది. తన కోసం ఇంత బాగా స్వరాలు సమకూర్చిన కీరవాణిని ఆయన స్వయంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్టూడియోని సందర్శించారు. అక్కడ ఆస్కార్‌ అవార్డును చూసి మురిపోతూ మన మూలాలు ఉన్న వ్యక్తి అస్కార్‌ లాంటి ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. అనంతరం ఆయనన సన్మానించారు.

 

తన కోసం వీరమల్లు రాసిని సలసల పాట 50 సార్లు విన్నానని, పౌరుషం తగ్గితే ఈ పాట వింటే తనలో పౌరషం వస్తుందన్నారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన అంశాలను కథలుగా మలిచి రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా కీరవాణి పవన్‌ కళ్యాణ్‌కు బహుమతిగా ఇచ్చారు. ఆ తర్వాత పవన్‌ కీరవాణిని సన్మానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక హరిహర వీరమల్లు మూవీ జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రెండు భాగాలు ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో పవన్‌ 18వ శతాబ్ధానికి చెందిన పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు.

 

PSPK Felicitates MM Keeravaani | #HariHaraVeeraMallu | Nidhhi Agerwal | Jyothi Krisna | AM Rathnam

Exit mobile version
Skip to toolbar