Site icon Prime9

Nandamuri Balakrishna: రష్మిక ఈజ్ మై క్రష్ . బాలకృష్ణ

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ టాక్ షో అన్‌స్టాపబుల్ రెండవ సీజన్ లో నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్ ముఖ్య అతిధులుగా ప్రారంభోత్సవ ఎపిసోడ్‌కి హాజరయ్యారు. ఇప్పుడు విశ్వక్ సేన్ మరియు సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నారు.

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహా ఈ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేసింది. మొదటి ఎపిసోడ్ పొలిటికల్ ఇంటరాక్షన్‌తో ఉండగా, రెండవ ఎపిసోడ్ ఉల్లాసకరంగా, సరదాగా అనిపిస్తుంది. నాకు నచ్చిన ఇద్దరు అబ్బాయిలను పిలిచాను అంటూ బాలకృష్ణ చెప్పగానే విశ్వక్ సేన్ , సిద్దు ఎంట్రీ ఇచ్చారు. ఎవరక్కడ సిద్దు బాబు తలదువ్వుకోలేదు అంటూ బాలకృష్ణ ఒక సెట్ బాయ్‌ని సిద్దు జుట్టు దువ్వడానికి పిలుస్తారు. దానికి సిద్దూ ఇది ఫేషన్ అని అన్నాడు. దానిపై బాలయ్య స్పందిస్తూ.ఆ గజిబిజి జుట్టు వల్ల నేను చాలా గందరగోళం సృష్టించానని అన్నారు.

‘మీలో ఒకరు మాస్ కా దాస్, మరొకరు మాస్ కా బాస్’ అని ఇద్దరు హీరోలతో అన్న బాలయ్య కానీ నేను మాస్ దేవుడిని అన్నారు. తన ప్రస్తుత క్రష్ గురించి అడిగినప్పుడు, ‘రష్మిక మందన్న’ అని బదులిచ్చారు.తరువాత, కియారా అద్వానీపై తనకు క్రష్ ఉందని సిద్ధూ వెల్లడించాడు. తరువాత,నిర్మాత సూర్య దేవర నాగ వంశీ వారితో చేరాడు. బాలయ్య భీమ్లా నాయక్ కోసం తన మొదటి ఎంపిక గురించి వంశీని అడిగారు. తరువాత బాలయ్య త్రివిక్రమ్‌కు డయల్ చేసి, అతన్ని షోకి ఆహ్వానించారు. తెలుసుకదా ఎవరితో రావాలో అని కామెంట్ చేసారు. ఈ ఎపిసోడ్ అక్టోబ‌ర్ 21న ఆహాలో ప్రసారమవుతుంది.

Exit mobile version