Site icon Prime9

Ranga Ranga Vaibhavanga On OTT: ఓటీటీలో రంగరంగ వైభవంగా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ranga ranga vaibhavanga movie on ott

ranga ranga vaibhavanga movie on ott

Ranga Ranga Vaibhavanga On OTT: ‘ఉప్పెన’తో టాలీవుడ్ను ఒక ఊపు ఊపిన హీరో వైష్ణవ్‌ తేజ్‌. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు ఈ యువ నటుడు. ఆ తర్వాత చేసిన కొండపోలం ఫ్లాప్‌ని ఇవ్వడంతో కాస్త గ్యాప్ కాస్తా గ్యాప్‌ తీసుకుని రంగ రంగ వైభవంగా మూవీతో సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో దసరా కానుకగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

రిలీజ్‌కు ముందు ట్రైలర్‌, పాటలతో ప్రేక్షకుల్లో హైప్‌ క్రియేట్‌ చేసిన రంగరంగ వైభవంగా మూవీ విడుదలయిన తర్వాత అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథ రోటిన్‌ ఉండడం వల్ల బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీని ఫలితంగా వైష్ణవ్‌ రెండో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీ డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందని సమాచారం. అక్టోబర్‌ 5న లేదా అక్టోబర్‌ 7 నుంచి ఈ మూవీ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తుంది.
ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్‌ త్వరలోనే అధికారిక ప్రకటన కూడా ఇవ్వనుందట.

ఇదీ చదవండి: Swathimuthyam Trailer: స్వాతిముత్యం ట్రైలర్ రిలీజ్.. ఫ్యామిలీ ఎంటరైనర్ గా మూవీ

Exit mobile version