Site icon Prime9

Rana Naidu Streaming: ఎట్టకేలకు నెట్ ఫ్లిక్స్ లో ‘రానా నాయుడు’

Rana Naidu Streaming

Rana Naidu Streaming

Rana Naidu Streaming: విక్టరీ వెంకటేష్, రానా కలిసి చేస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోన‌వ‌న్’ ఆధారంగా ఈ సిరీస్ తెర‌కెక్కింది.

భారతీయుల అభిరుచి తగ్గట్టు మార్పులు చేసి తీర్చి దిద్దారు. ఈ వెబ్ సిరీస్ కి సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు.

 

నెట్ ఫ్లిక్స్ లో మొదలైన స్ట్రీమింగ్(Rana Naidu Streaming)

కాగా, శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

మార్చి 10 నుంచి రానా నాయుడు స్ట్రీమింగ్ అనడంతో.. గురువారం అర్థరాత్రి నుంచే అభిమానులు ఎదురు చూశారు.

కానీ, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయింది. ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్ లు ఉన్నాయి.

ఒక్కో ఎపిసోడ్ 45 నుంచి 50 నిమిషాలు నిడివి ఉన్నాయి. తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, స్పానిష్ ఆడియోతో రానా నాయుడు అందుబాటులో ఉంది.

ఇంగ్లీష్, హిందీ సబ్ టైటిల్స్ తో కూడా రానా నాయుడు స్ట్రీమ్ అవుతోంది.

 

 

చాలా ఎమోషన్స్ ఉన్నాయి: వెంకటేష్

మరో వైపు వెంకటేష్, రానా(Rana Naidu) కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. దీంతో ఈ సిరీస్ పై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా, సిరీస్ కు సంబంధించి గురువారం రాత్రి ప్రీమియర్ ను ఏర్పాటు చేసింది యూనిట్.

సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖలు ఈ షోను వీక్షించారు. ‘ కష్టపడి పనిచేశాం.

ఈ సిరీస్ డార్క్ ఫ్యామిలీ డ్రామా. ఇందులో చాలా ఎమోషన్స్, హింసతో పాటు సెక్స్ కూడా ఉంది.

నెట్ ఫ్లిక్స్ టీమ్ చాలా నిజాయితీగా పనిచేసింది. మీరు ల్యాప్ టాప్, మొబైల్ ఓపెన్ చేసి చూడటం మొదలు పెడితే మీ ఎక్స్ ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి.

ఇందులో ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా నటించారు. ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ రాన్ షో. అక్కడక్కడా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి’ అని వెంకటేష్ తెలిపారు.

 

 

 

 

 

Exit mobile version