Site icon Prime9

Web Series: 2022లో వచ్చిన భారీ బడ్జెట్ వెబ్ సిరీస్ లు ఇవే..!

2022 web series

2022 web series

Web Series: ఇప్పుడు మనం ఏ టాపిక్ మాట్లాడుకున్నా కరోనా ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్ట చూసే సినిమా ఇలా ఒక్కటేమిటి ప్రతీ ఒక్కదానిలో కోవిడ్ చాలా మార్పులు తెచ్చిందనే చెప్పవచ్చు. కాగా కరోనా అనంతరం సినీ ప్రేక్షకుల అభిరుచుల్లోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. లాక్‌డౌన్ కాలంలో థియేటర్లు మూతపడడం వల్ల అందరూ ఓటీటీ ఫ్లాట్ ఫాంలకు అలవాటు పడ్డారు. అందులోనూ వెబ్‌సిరీస్‌ లపై అత్యంత మక్కువ కనపరుస్తున్నారు. ఓటీటీలను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం ప్రారంభించారు. అందువల్ల డిజిటల్ ప్లాట్‌ఫాంలు కూడా తమ సబ్ స్క్రైబర్లకు కొత్త కంటెంట్‌ను అందించడం మొదలుపెట్టాయి.

ఓటీటీ ప్లాట్ ఫాంలు ప్రేక్షకులకు పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమాలను కాకుండా కొత్త అనుభూతిని అందించేందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తున్నాయి. మూవీలను తలదన్నేలా భారీ ఖర్చుతో ఈ వెబ్ సిరీస్ లను రూపొందిస్తున్నాయి. కాగా అలా రూపొందించబడిన వెబ్ సిరీస్లు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

భారీ వ్యయంతో నిర్మించి 2022లో ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ “ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్”. ఈ సిరీస్ అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది. ఈ సిరీస్ ను దాదాపుగా 465మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారట. అమెజాన్ ఇప్పటి వరకు తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ల్లో ఇదే అత్యంత ఖరీదైందట. అయితే ‘రింగ్స్ ఆఫ్ పవర్’ కు వెచ్చించిన దాంట్లో సగం ఖర్చుతోనే “స్ట్రేంజర్ థింగ్స్ సీజన్-4” ను రూపొందించారు. దీనికి 270మిలియన్ డాలర్ల బడ్జెట్‌ ఖర్చయింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ కూడా భారీ బడ్జెట్‌తో రూపొందిన వెబ్‌సిరీస్‌ల్లో మూడో స్థానంలో ఉంది. ఇక ఈ సిరీస్ ను 250మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారట. ఆగస్టు నుంచి హెచ్బీవోలో ప్రసారం అవుతున్న “హౌస్ ఆఫ్ ద డ్రాగన్” నాలుగో ఖరీదైన షోగా నిలిచింది. ఈ వెబ్‌సిరీస్‌ను 200మిలియన్ డాలర్స్ బడ్జెట్‌తో తెరకెక్కించారట. ఇలా డిజిటల్ ప్లాట్ ఫాంలు ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ భారీ వసూళ్లను రాబడుతున్నాయనే చెప్పవచ్చు.

ఇదీ చూడండి:  “శ్రీవల్లి” చీరకు భారీ డిమాండ్.. నార్త్ లోనూ రష్మిక క్రేజ్..!

Exit mobile version