Site icon Prime9

Bimbisara: ఓటీటీలోకి వచ్చేస్తున్న “బింబిసార”.. ఈనెల 7 నుంచే స్ట్రీమింగ్

Bimbisara Ott date fix

Bimbisara Ott date fix

Bimbisara: ఈ ఏడాది బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిత్రాలలో కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ ఒకటి. మల్లడి వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్‌లను రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ డ్యూయల్‌ రోల్‌లో అద్భుతంగా నటించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో విడుదలవుతుందాని ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపికబురు చెప్పారు మూవీ మేకర్స్.

ఈ సినిమా ఓటీటీ హక్కులను ‘జీ-5’ సంస్థ భారీ ధరకు కైవసం చేసుకోగా అక్టోబర్‌ 7నుంచి స్ట్రీమింగ్‌ అవనున్నట్టు జీ సంస్థ వెల్లడించింది. ఈ మూవీలో క‌ళ్యాణ్‌రామ్‌కు సరసన కేథ‌రిన్ ట్రెసా, సంయుక్త మీన‌న్‌లు హీరోయిన్లుగా న‌టించారు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ప్రస్తుతం ‘బింబిసార-2’ స్క్రిప్ట్‌ పనులు నడుస్తున్నాయి. అన్ని కుదిరితే వచ్చే సంవత్సరంలో ఈ మూవీ సీక్వెల్‌ రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: తమిళ సినీ చరిత్రలోనే మొదటి సారి.. పొన్నియన్ సెల్వన్ కలెక్షన్ల ప్రభంజనం..!

 

Exit mobile version