Kadhalikka Neramillai Movie Now Streaming in OTT: నిత్యా మీనన్, రవి మోహన్ (జయం రవి) జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘కాదలిక్క నేరమిళ్లై’ ఓటీటీకి వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. లవ్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక తమిళ బాక్సాఫీసు డిసెంట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని నెల రోజుల ముందే డిజిటల్ ప్రీమియర్‌కి ఇవ్వడం విశేషం. అయితే థియేటర్లో కేవలంతో తమిళంలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లోకి వచ్చింది.
దీంతో ఓటీటీ ప్రియులంత ఫుల్ ఖుష్ అవుతన్నారు. ప్రముఖు ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ తీసుకుంది. రిలీజ్‌కి ముందే ఈ సినిమా రైట్స్‌ని దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ నెల రోజుల ముందే స్ట్రీమింగ్‌కి ఇచ్చింది. జనవరి 11 నుంచి సినిమా ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ రోజు(మంగళవారం) అర్థరాత్రి నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలంలో తమిళంలో థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ సినిమాను ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హందీ భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది నెట్‌ఫ్లిక్స్.
మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఈ లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ ఆయా భాషల్లో ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి. కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించిన ఈ సినిమా నిత్యా మీనన్, రవి మోహన్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రస్తుత జనరేషన్ రిలేషన్‌షిప్స్ నేపథ్యంలో కామెడీ లవ్‌స్టోరీగా ఈ కాదలిక్క నేరమిళ్లైని తెరకెక్కించారు. ఐవీఎఫ్‌లో జరిగే గందరగోళం, ఆ తర్వాత ఏర్పడే బంధాల చూట్టూ ఈ సినిమా సాగనుంది. ఇందులో యోగి బాబు, వినయ్ రాయ్. టీజే భాను, కొక్కెన్, లాల్ వినయ్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని కీలక పాత్రలు పోషించారు.