Site icon Prime9

Kanguva: ఆస్కార్‌ బరిలో నిలిచిన డిజాస్టర్‌ మూవీ – సౌత్‌ ఇండియా నుంచి పోటీలో రెండు సినిమాలు

Kanguva Selected for Oscar 2024 Nominations: ఇటీవల దియేటర్లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన సినిమా ఆస్కార్‌ బరిలో నిలిచింది. చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ఆస్కార్‌ అవార్డు. ప్రతి నటుడు తమ జీవితంలో ఒక్కసారైన ఆస్కార్‌ అవార్డు గెలవాలని కలలు కంటుంటారు. ఏదైనా సినిమా ఆస్కార్ బరిలో నిలిచిందంటే ఆ ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగినట్టే. గతేడాది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని పాట ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతీని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక ఈ ఏడాదికి 97వ ఆస్కార్‌ అవార్డులకు గానూ నామినేషన్స్‌ మొదలయ్యాయి.

ఈ సారి బరిలో సౌత్‌ నుంచి రెండు సినిమాలు ఎంపిక అయ్యాయి. అందులో హీరో సూర్య కంగువ (Kanguva Movie) ఆస్కార్‌లో బరిలో నిలిచింది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘ది గోట్‌ లైఫ్’ (The Goat Life) చిత్రం కూడా పోటీలో నిలిచింది. వీటితో ఆపటు సంతోష్‌, స్వాతంత్ర్య వీర సావర్కర్‌, ఆల్‌ వుయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ (మలయాళం) చిత్రాలు కూడా ఉన్నాయి. షార్ట్‌ లిస్ట్‌ అయినా సినిమా నుంచి ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్లను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి జనవరి 12 వరకు జరుగుతుంది. జనవరి 17న నామినేషన్స్‌ను ప్రకటిస్తుంది అకాడమి.

కాగా సూర్య నటించిన కంగువ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం 2024 నవంబర్‌ 14న ప్రేక్షకుల విడుదలై ప్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న కంగువా ఫైనల్‌ డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి పార్ట్‌లో ల్యాగ్‌ ఎక్కువ ఉండటంతో ఆడియన్స్‌ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో కంగువ మూవీ ప్లాప్‌గా నిలిచింది. థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఆస్కార్‌ బరిలో నిలవడం విశేషం.

Exit mobile version