Site icon Prime9

Movie on Operation Sindoor: వెండితెరపైకి ‘ఆపరేషన్‌ సిందూర్’.. టైటిట్‌ పోస్టర్‌ వచ్చేసింది.. చూశారా..?

Operation Sindoor Movie First Poster Out: ఆపరేషన్‌ సిందూర్‌.. ప్రస్తుతం శత్రు దేశాన్ని వణికిస్తున్న పేరిది. గత ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌కు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో భారత్ బుద్ది చెబుతోంది. ఇప్పటికీ ఈ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. శుత్రువులను వణికిస్తోన్న ఈ పవర్ఫుల్‌ ఆపరేషణ్‌ త్వరలోనే వెండితెరపైకి రాబోతోంది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో బాలీవుడ్‌ బడా నిర్మాణ సంస్థ మూవీని తెరకెక్కించబోతోంది.

 

ఈ మేరకు తాజాగా టైటిల్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేసింది. ఈ టైటిల్‌ రైట్స్‌ దక్కించుకోవడం కోసం సుమారు 15పైగా నిర్మాణ సంస్థలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. ఆఖరి రిలయన్స్‌ సంస్థ కూడా ఈ టైటిల్‌ని రైట్స్‌ని తీసుకోవాని పోటీ పడింది. చివరికి ‘ఆపరేషన్‌ సిందూర్‌’ని నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్‌ పతాకం, ది కంటెంట్ ఇంజనీర్ బ్యానర్లు దక్కించుకుని సంయుక్తంగా సినిమాను నిర్మించనున్నాయి. ఈ మేరకు దీంతో ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో ఉన్న టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఆర్మీ యూనిఫాంలో ఉన్న మహిళా జవాన్‌.. రైఫిల్‌ పట్టుకుని, నుదిటిన సింధూరం పెట్టుకుంటున్నట్టు చూపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఫైటర్‌ జెట్స్‌, బాంబుల విధ్వంసంతో మండుతున్న యుద్ధ భూమిని చూపించారు.

 

పహలామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులు, యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇండియన్‌ ఆర్మీ పహల్గామ్‌ ఉగ్రదాడిని తిప్పి కొట్టేందుకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ఆపరేషన్‌ను చేపట్టింది. దాడికి కొన్ని నిమిషాల ముందే ఈ పేరుతో పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత భద్రత దళాలు దాడి చేసి 100 మంది ముష్కరులను మట్టికరిపించాయి. ఆపరేషన్‌ తర్వాత న్యాయం జరిగిందంటూ ఇండియన్‌ ఆర్మీ పోస్టర్‌ షేర్‌ చేసింది. దీంతో ఈ ఆపరేషన్‌ పేరు భారత్‌ వ్యాప్తంగా మారుమ్రోగింది. టైటిల్‌ పవర్ఫుల్‌గా ఉండటంతో నిర్మాణ సంస్థ టైటిల్‌ రైట్స్‌ని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. అందులో టీ-సిరీస్‌, జీ-స్టూడియోస్‌తో పాటు పలు ఆగ్ర నిర్మాణ సంస్థు ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌లో దరఖాస్తు చేసుకున్నాయి.

Exit mobile version
Skip to toolbar