Site icon Prime9

Court OTT Release Date: ఆఫీషియల్‌.. కోర్టు ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..?

Court Movie Streaming on April 11th in Netflix: హీరో నాని సమర్పణలో నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో హర్ష రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కోర్ట్‌’. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ. 50 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. మార్చి 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ షోతోనే హిట్‌ టాక్‌ అందుకుంది. కోర్డు బ్యాక్‌డ్రాప్‌లో పోక్సో యాక్ట్‌ కేసు నేపథ్ంలో సాగిన ఈ చిత్రం విమర్శకులు ప్రశంసలు అందుకుని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండ థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకుంది. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ తీసుకుంది.

 

ఒప్పందం ప్రకారం ఈ సినిమాను ఓటీటీకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ కోర్డ్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసి అధికారిక ప్రకటన ఇచ్చింది. ఏప్రిల్‌ 11 నుంచి మూవీని స్ట్రీమింగ్‌ ఇస్తున్న ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ షేర్‌ చేసింది. మేరకు రిలీజ్ డేట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. ఏప్రీల్‌ 11వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు స్పష్టం చేసింది. మరికొన్ని రోజుల్లో కోర్ట్‌ ఓటీటీకి వస్తుండటంతో మూవీ లవర్స్‌ అంత ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాని సమర్పణలో వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌పై ప్రశాంతి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహించారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు.

 

 

Exit mobile version
Skip to toolbar