NTR30: ఎన్టీఆర్ 30వ సినిమా గురించి నిర్మాతలు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై జోరుగా చర్చ సాగింది. ఆ చర్చకు బ్రేక్ వేస్తూ.. నిర్మాతలు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు.
జాన్వీనే హీరోయిన్.. (NTR30)
ఎన్టీఆర్ 30వ సినిమా గురించి తాజాగా అప్ డేట్ వచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో కొద్ది రోజులుగా వస్తున్న వార్తలకు నిర్మాతలు చెక్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ అవి ఇంకా మొదలుకాలేదు. కానీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ తర్వాతి సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల మార్చ్ చివర్లో షూటింగ్ మొదలుపెడతారని, సినిమా పూజా కార్యక్రమం ఫిబ్రవరిలో జరుగుతుందని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించాడు. కానీ నందమూరి తారకరత్న మరణించడంతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం వాయిదా పడింది.
అమెరికా నుంచి ఎన్టీఆర్ తిరిగి వచ్చే వరకు.. 30వ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఉండదు. ఎన్టీఆర్ తిరిగి వచ్చాకే ఈ సినిమా పనులు మెుదలు కానున్నాయి. గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తాలు వచ్చాయి. కానీ దీనిపై ఎవరు స్పందించలేదు. జాన్వీ సైతం గతంలో సౌత్ సినిమాల నుంచి ఆఫర్స్ వస్తే నటిస్తానని అంది. ఎన్టీఆర్ నా ఫేవరేట్ హీరో అని, ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి.
ఎన్టీఆర్ నా ఫేవరేట్ హీరో..
జాన్వీ కపూర్ తన ఇష్టమైన హీరోతో అవకాశం రావడంతో.. ఓకే చేసేసింది. జాన్వీకి బాలీవుడ్ లోనే కాక సౌత్ లో కూడా అభిమానులు ఉన్నారు. శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ సౌత్ లో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ 30వ సినిమాతో జాన్వీ తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతుంది. శ్రీదేవి తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. జాన్వీ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా పడలేదు. ఇక చిత్రయూనిట్ జాన్వీ కపూర్ ఫొటోతో రిలీజ్ చేసిన పోస్టర్ ని జాన్వీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఫైనల్ గా ఇది జరుగుతుంది. నా ఫేవరేట్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా అంది అని పోస్ట్ చేసింది. ఇక ఎన్టీఆర్ అభిమానులు జాన్వీకి టాలీవుడ్ లోకి వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.