Site icon Prime9

Netflix: నెట్‌ఫ్లిక్స్‌ సేవలకు అంతరాయం – లాగిన్‌లో సమస్యలు, అసహనం వ్యక్తం చేసిన యూజర్స్

Thousands of Netflix users Faces Login Issue World Wide: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. యాప్‌ లాగిన్‌లో సమస్యలు తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల సబ్‌స్కైబర్స్‌ ఇబ్బంది పడ్డారు. కొన్ని గంటల పాటు ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌పై అసహనం చూపిస్తూ సబ్‌స్క్రైబర్స్‌ అంతా వరుసగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ షేర్‌ చేశారు. అమెరికా, యూకే దేశాలకు చెందని సబ్‌స్కైబర్స్‌ ఈ సమస్యను ఎదుర్కొన్నారు.

 

ముఖ్యంగా యూఎస్‌లోని న్యూయార్క్‌, చికాగో, డల్లాస్‌, లాస్‌ ఏంజెలెస్‌కు చెందిన యూజర్స్‌ ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఆయా దేశాలకు చెందని యూజర్స్‌ వరుసగా పోస్ట్స్‌ పెట్టారు. లాగిన్‌ ఎర్రర్‌ వస్తోందిన, తమ అకౌంట్‌ ఒపెన్‌ అవ్వడం లేదని, కొంత సమయంలో తర్వాత తిరిగి ప్రయత్నించండి అని సందేశం వస్తున్నట్టు యూజర్స్‌ స్క్రీన్‌ షాట్స్‌ షేర్‌ చేశారు. మరికొందరు అయితే తమ ప్రొఫైల్‌ మిస్‌ మ్యాచ్‌ అవుతుందని, తమ ప్రొఫైల్‌ బదులుగా మరొకరిది ఒపెన్‌ అయినట్టు చెప్పారు.

 

దీంతో యూజర్స్‌ కంప్లైయిట్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ వెంటనే స్పందించింది. కొద్ది క్షణాల్లోనే సమస్యను పరిష్కరించిన తిరిగి సేవలను పునరుద్ధరించింది. కాగా సాంకేతిక లోపం కారణంగానే లాగిన్‌లో సమస్యలు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ యూజర్స్‌ ఎక్కువ సంఖ్యలో ఉన్న విషయం తెలిసిందే. మిగతా డిజిటల్‌ ప్లాట్‌ఫాంతో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్‌ యూజర్స్‌ సంఖ్యే అధికం. ఇక 2025 నాటికి నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న వారి సంఖ్య 300 మిలియన్లకు చేరుకుంది. కేవలం ఒక్క అగ్రదేశం అమెరికాలోనే ఈ సంఖ్య 81 మిలియన్లుగా ఉన్నట్టు సమాచారం.

Exit mobile version
Skip to toolbar