Site icon Prime9

Nayanthara – Vignesh Shivan : ఉయర్, ఉలగ్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన నయనతార – విఘ్నేశ్..

Nayanthara - Vignesh Shivan kids birthday post goes viral

Nayanthara - Vignesh Shivan kids birthday post goes viral

Nayanthara – Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార – విఘ్నేశ్ శివన్ గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ‘నేనూ రౌడీనే’ చిత్రంతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి 2022 జూన్ 9న మహాబలిపురంలో వివాహం చేసుకున్నారు. కాగా అనంతరం అక్టోబర్ 22న సరోగసీ ద్వారా కవలలకు వేరు జన్మనిచ్చారు. ఇక ఆ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా కూడా మారింది.
అప్పటి నుంచి నయనతార ఎక్కువ సమయం తన పిల్లలను చూసుకునేందుకే కేటాయించింది. ట్విన్స్ కు ఉయిర్, ఉలగ్ అని నామకరణం కూడా చేశారు. ఇక తన ట్విన్స్ ఫస్ట్ బర్త్ డే రానే వచ్చేసింది. ఈరోజు పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.

నయన్ దంపతులు ఆ పిల్లలకు ఉయర్ రుద్రో నీల్, ఉలగ్ దైవిక్ అనే పేర్లు పెట్టారు. ఇక ఆ తర్వాత నుంచి పలుమార్లు సోషల్ మీడియా వేదికగా పిల్లల ఫోటోలు షేర్ చేస్తున్నప్పటికీ వల్ల ముఖ్యం మ కనిపించకుండా ఫోటోలు పెట్టారు. అయితే తాజాగా ఉయర్, ఉలగ్ పుట్టి నిన్నటికి సంవత్సరం అవుతుండటంతో వీరి మొదటి పుట్టిన రోజు వేడుకల్ని మలేషియాలో నిర్వహించారు. ఈ క్రమంలోనే మొదటి సారి నయన్ దంపతులు తమ కవల పిల్లల ఫోటోలు ముఖాలు చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ మేరకు ఆ పోస్ట్ లో.. పిల్లల్ని ఎత్తుకున్న ఫోటోలు, మలేషియా కౌలాలంపూర్ ట్విన్ టవర్స్ వద్ద ఫోటోలు పోస్ట్ చేశారు. అదే విధంగా.. మా బంగారు కొండలు ఉయర్, ఉలాగ్ పుట్టి సంవత్సరం అయిపోయింది. మీరు మా జీవితంలోకి వచ్చి మా జీవితాన్ని ఎంతో ఆనందంగా మార్చారు. మీ మొదటి పుట్టిన రోజుని ఎలా సెలబ్రేట్ చేయాలనుకున్నామో.. అలా జరిగినందుకు దేవుడికి ధన్యవాదాలు. అమ్మ నాన్న మిమ్మల్ని ఎంతగానో లవ్ చేస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. అలానే పలువురు ప్రముఖులు, అభిమానులు పిల్లలకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

 

Exit mobile version