Site icon Prime9

Ugadi Special Show : ఉగాదికి బుల్లితెరపై రచ్చ చేయడానికి వచ్చేస్తున్న నాచురల్ స్టార్, మాస్ మహరాజ్..

nani and raviteja in star maaa ugadhi special show

nani and raviteja in star maaa ugadhi special show

Ugadi Special Show : పండగ వచ్చింది అంటే చాలు.. వెండితెరపై సినిమాలు ఏ విధంగా పోటీ పడతాయో.. బుల్లితెరపై కూడా ప్రోగ్రామ్ లతో ఛానల్స్ ఆ విధంగానే పోటీ పడుతూ ఉంటాయి. అదే రేంజ్ లో ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఛానల్‌ లోనూ పోటా పోటీగా స్పెషల్ షోలు చేయడం ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. కాగా ఈ నెల 22న ఉగాది కావడంతో ‘స్టార్ మా’ కూడా బుల్లితెర సెలబ్రెటీలతో ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసింది. ఈ స్పెషల్ షోకి నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజా రవితేజ అతిథులుగా రావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ మేరకు తాజాగా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రోమో ని రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో.. “ఉగాది అంటేనే ఆనందాలకు పునాది”.. కనుక పండగను బుల్లితెరకు సంబంధించిన 12 కుటుంబాలతో మరింత వేడుకగా కుటుంబ సమేతంగా జరుపుకుందాం అంటూ రాసుకొచ్చింది. ఈ షోకి రవి, వర్షిణి యాంకర్లుగా చేయనున్నారు. బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ తన కుటుంబంతో రాగా, బిగ్‌బాస్ సెలబ్రెటీలు వాసంతి, ముక్కు అవినాశ్, బాల ఆదిత్య, గీతూ రాయల్ ఇలా అంతా వచ్చి సందడి చేశారు.

ఆ రిలీజ్ చేసిన ప్రోమోలో.. గీతూ రాయల్ తన ఫ్యామిలీతో స్టేజిపైకి వచ్చింది. ఆ తర్వాత బాబా భాస్కర్ తన భార్యతో షోకి వచ్చారు. దీంతో యాంకర్ వర్షిణి.. “మీ భర్త ఎవరి కంట్రోల్‌లో ఉంటారు” అని అడగ్గా “నా కంట్రోలే..” అని ఆమె బాబా భాస్కర్ భార్య చెప్పారు. దీంతో “మీ కంట్రో‌ల్‌లోనే ఉంటాడా..” అంటూ వర్షిణి గట్టిగా అరిచింది. దీంతో “అందరూ వైఫ్ కంట్రోల్‌లోనే ఉంటార్రా” అంటూ బాబా భాస్కర్ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు.

 

పంచె కట్టులో నాని.. మాస్ ఎంట్రీ ఇచ్చిన రవితేజ (Ugadi Special Show)..

ఇక ప్రోమోలో ఆ తర్వాత హీరో నాని పంచె కట్టులో ఎంట్రీ ఇచ్చాడు. నాని మాట్లాడుతూ.. “ఇన్ని కుటుంబాలను ఒక్క చోట చూస్తుంటే.. అసలైన ఉగాది ఇక్కడే.. ఈరోజు ఈస్టేజి మీద ఉందనిపిస్తుంది” అన్నాడు . ఇక ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీలతో ‘టగ్ ఆఫ్ వార్’ ఆడించారు. ఆ తర్వాత అమ్మా రాజ్‌శేఖర్ డ్యాన్స్ వేసినట్లు చూపించారు. తర్వాత ‘జానకి కలగనలేదు’ సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్, ముక్కు అవినాశ్‌తో కలిసి స్వాతిముత్యం సినిమాలో పాటకు డ్యాన్స్ చేసింది. తర్వాత బాల ఆదిత్యతో కలిసి ‘కోయిలమ్మ’ సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక ప్రోమో చివరిలో మాస్ మహారాజా రవితేజను చూపించారు. “ఈ ఉగాదికి మీ అందరికీ ఫుల్లు కిక్కే కిక్కు..” అంటూ తనదైన స్టైల్‌లో రవితేజ డైలాగ్ చెప్పడంతో ప్రోమో ఎండ్ అయింది. ఆ ప్రోమోని మీరు కూడా ఓ లుక్కేయండి.

Exit mobile version