Site icon Prime9

Daaku Maharaj: ‘డాకు మహారాజ్‌’ రిలీజ్‌ ట్రైలర్‌ చూశారా?

Daku Maharaj Release Trailer: గాడ్ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్‌ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం డాకు మహారాజ్‌. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 12)న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌,టీజర్‌,ట్రైలర్‌, పాటలు మూవీ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఇక రేపే మూవీ విడదల సందర్భంగా చిత్ర బృందం ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌ మూవీ ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇక తాజాగా విడుదలైన రిలీజ్‌ ట్రైలర్‌ సినిమాపై మరింత బజ్‌ క్రియేట్‌ చేస్తుంది.

ట్రైలర్‌లో బాలయ్యను వైల్డ్‌గా చూపించారు. అడవిలో విలన్స్‌ను చంపుతూ వైల్డ్‌ లుక్‌లో కనిపించాడు బాలయ్య. ఒంటి మీద 16 కత్తిపోట్లు, ఒక బుల్లెట్‌ అయినా కిందపడకుండ అంతమందిని నరికాడు అంటే అతడు మనిషి కాదు వైల్డ్‌ యానిమల్‌” అంటూ వచ్చిన బ్యాగ్రౌండ్‌లో వచ్చిన డైలాగ్ సినిమాలో బాలయ్య తెగింపును పరిచయం చేస్తూ సాగింది. ఆ తర్వాత ఎవరైన చదవడంలో మాస్టర్స్‌ చేస్తారు.. నేను చంపడంలో మాస్టర్స్‌ చేశాను అనే మాస్‌ వార్నింగ్‌ ఆకట్టుకుంది. ఇక రాయలసీమ పేరు విన్నారా? అది నా అడ్డా అనే డైలాగ్‌ అదిరిపోయింది.

Exit mobile version