Site icon Prime9

Daaku Maharaj Twitter Review: డాకు మహారాజ్‌ ట్విటర్‌ రివ్యూ – నెటిజన్స్ ఏమంటున్నారంటే!

Daaku Maharaj Twitter Review: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ హీరో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. టైటిల్‌తోనే మూవీపై బజ్‌ పెంచింది మూవీ టీం. శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ భామ ఊర్వశీ రౌతేలా స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. మొదటి నుంచి ప్రచార పోస్టర్స్‌, కార్యక్రమాలతో మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌లో బాలయ్యను వైల్డ్‌గా చూపించాడు బాబీ. ఆయన మాస్‌ ఎలివేషన్స్‌కి తన ఇచ్చిన బీజీయంకి ఇక థియేటర్లో బాక్స్‌లు బద్ధలతాయంటూ మొన్న ఈవెంట్‌లో తమన్‌ చెప్పి ఓ రేంజ్‌లో హైప్ ఇచ్చాడు. రిలీజ్‌ ముందు విడుదలైన రిలీజ్‌ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఎన్నో అంచనాల మధ్య నేడు (జనవరి 12)న విడుదలైన డాకు మహారాజ్ సోషల్‌ మీడియాలో టాక్‌ ఎలా ఉందో చూద్ధాం!

ఏపీలో ఇప్పటికే ఫస్ట్‌ షో పూర్తి చేసుకుంది. తెలంగాణ మాత్రం ఉదయం 8 గంటల ఫస్ట్‌ షో పడింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో మూవీ గురించి విశేషాలను పంచుకుంటున్నారు. డాకు మహారాజ్‌ కథ ఏంటీ? ఎలా ఉంది? బాలయ్య ఖాతాలో హింట్‌ పడిందా లేదా? ట్విటర్‌ రివ్యూలో తెలుసుకుందాం. ట్విటర్‌ రివ్యూ ప్రకారం.. ఇప్పటి వరకు డాకు మహారాజ్‌కు మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది. మూవీ బ్లాక్‌బస్టర్‌ అని కొందరు, మరికొంత టీజర్‌, ట్రైలర్‌లో చూపించినట్టు ఆశించిన స్థాయిలో సినిమాలో లేదంటున్నారు.

ఫిలిం క్రిటిక్‌ ఉమైన సంధు డాకు మహారాజ్‌కు తాను ఇచ్చిన ఫస్ట్‌ రివ్యూ లాగే మూవీ ఉందని సినిమా చూసిన ఆడియన్స్‌ అంటున్నారు. నా అంచనాలు కరెక్ట్‌ అయ్యాయి. ఈ సంక్రాంతి మాస్‌ మసాలా జాతర చూడండి. ఈ సినిమా బాలయ్య మాస్‌ అవతార్‌ నెక్ట్‌ లెవల్లో ఉంది. అలాగే యాక్షన్‌, ఎమోషన్స్‌, డ్రామా, కామెడీ పైసా వసూల్‌ పర్ఫామెన్స్‌ అన్నారు.

ఓ యూజర్‌ “బాబీ డాకు మహారాజ్‌తో మాస్‌ జాతర చూపించాడంటున్నారు. విజువల్స్‌ బాగున్నాయి. విజయ్‌ ఖన్నా డీవోపీ సూపర్‌, తమన్‌ పవర్ఫుల్‌ బీజీయ్‌ అదిరిపోయింది. బాబీ కోల్లి దర్శకత్వం బాగుంది. కానీ, అంచనాలకు దగ్గరగా క్లైమాక్స్‌ ఉంది. కానీ బాలయ్య మంచి హిట్‌ పడినట్టు అనిపిస్తోంది” అని కామెంట్‌ చేశాడు.

 

Exit mobile version