Nagarjuna Comments on Naga Chaitanya and Sobhita:తన కోడలు, నాగ చైతన్య సతీమణి శోభిత దూళిపాళపై కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. చై, శోభితను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందంటూ మురిసిపోయారు. ఇటీవల నాగార్జున ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కోడలు శోభిత గురించి చెప్పమని అడగ్గా.. తను మంచి మనసున్న అమ్మాయి అంటూ కోడలిని కొనియాడారు.
నాగచైతన్యతో పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసు. తను చాలా తెలివైన అమ్మాయి. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. తన సినిమాలు చూస్తే అది మీకే అర్థమవుతుంది. ఎప్పుడూ కూడా కూల్‌గా ఉంటుంది. సంతృప్తిగా ఉంటుంది. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన అమ్మాయి. అలాంటి అమ్మాయి చై జీవితంలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. తను వచ్చాక చై చాలా ఆనందంగా ఉన్నాడు. వారిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్లిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది” అని చెప్పుకొచ్చారు.
ఇక పెళ్లికి ముందు కూడా నాగార్జున పలుమార్లు ప్రశంసలు కురిపించారు. గుఢాచారి సినిమా సక్సెస్ మీట్‌కి వెళ్లినప్పుడు తన గురించి మాట్లాడాడు. తన చాలా అందంగా ఉందని అన్నాడు. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని, తన యాక్టింగ్ బాగుందని ప్రశంసించినట్టు చెప్పారు. అలాగే ఒకసారి తనని వాళ్ల ఇంటికి విందుకు ఆహ్వానించినట్టు నాగార్జున చెప్పారు. ఇక నాగచైతన్య శోభితలు కూడా మొదటి సారి 2018లోనే కలిసినట్టు శోభిత ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. నాగార్జున వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ చై చూసినట్టు చెప్పింది. అయితే తమ ప్రేమ మాత్రం 2022 నుంచి మొదలైనట్టు శోభిత ఇటీవల ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.