Site icon Prime9

Naga Chaitanya : సమంత సినిమాల్లో అదే నా ఫేవరెట్ అని చెప్పి షాక్ ఇచ్చిన నాగచైతన్య..

naga chaitanya comments on samantha family man web series

naga chaitanya comments on samantha family man web series

Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరుగాంచిన సమంత – నాగచైతన్యలు పరిచయం అక్కర్లేని జంట. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత స్నేహంగా.. ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం వరకు జరిగింది. కానీ అనుకోని విధంగా అందరికీ షాక్ ఇస్తూ ఈ జంట విడిపోవడం అనేది తెలుగు ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఎన్టి అని స్పష్టంగా తెలియడం లేదు. అయితే నిత్యం ఏదో విధంగా సామ్ చై వార్తల్లో నిలుస్తునే ఉంటున్నారు.

దీంతో వారిద్దరు విడిపోయిన తర్వాత లెక్కలేనన్ని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో బోల్డ్ రోల్స్ లో నటించడం వల్లే నాగచైతన్యతో విడాకుల దాకా వెళ్ళింది అని అందరూ అనుకున్నారు. అయితే ఆ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించడం నాగచైతన్యకి, అక్కినేని కుటుంబానికి నచ్చలేదని.. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు బోల్డ్ రోల్స్ లో నటించవద్దని సమంతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని కానీ సమంత అందుకు అంగీకరించకుండా వారి బంధానికి గుడ్ బై చెప్పిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా సమంత గురించి నాగ చైతన్య చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కి గురి చేస్తున్నాయి.

నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన సినిమా “కస్టడీ”. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కి సిద్దమవుతుంది. మే 12 వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న చైతన్య.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తన విడాకుల విషయం గురించి మొదటిసారి పూర్తిగా ఓపెన్ అయ్యి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు వల్లే వారిద్దరూ విడిపోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చిన నాగచైతన్య.. సమంత చాలా మంచి అమ్మాయి అంటూ, తను ఎప్పుడు సంతోషంగా ఉండాలంటూ చేసిన కామెంట్స్ చేశాడు.

ఇప్పుడు మరొమారు ఓ ఇంటర్వ్యూలో సామ్ కి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. మజిలీ సినిమా తరువాత సమంత నటించిన సినిమాల్లో మీకు ఏదంటే ఇష్టం అని యాంకర్ ప్రశ్నించగా.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అంటే బాగా ఇష్టమని, ఆ తరువాత ‘ఓ బేబీ’ సినిమా అంటే ఇష్టమని చైతూ చెప్పుకొచ్చాడు. అలాగే ఇప్పటికి తన ప్రతి మూవీ చూస్తానని చెప్పాం విశేషం. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు రావడానికి కారణం ఫ్యామిలీ మ్యాన్ సిరీసే కారణమంటూ అప్పటిలో వచ్చిన వార్తలు అన్నీ ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version