Site icon Prime9

Music Director Raj: టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

Music Director Raj

Music Director Raj

Music Director Raj: తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

సంగీత ప్రపంచంలో రాజ్- కోటి ద్వయానికి ఎంతో పేరుంది. ఈ ద్వయం దశాబ్ధాల పాటు తమ సంగీతంతో అలరించింది. రాజ్ మరణంతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. రాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

 

ఎన్నో హిట్ చిత్రాలకు రాజ్-కోటి సంగీతం(Music Director Raj)

రాజ్‌-కోటి సంయుక్తంగా ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించింది. దాదాపు 150 కు పైగా చిత్రాలకు వీరి ద్వయం పనిచేసింది. ‘ముఠామేస్త్రి’,‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్‌’ వంటి చిత్రాలు వీరివురికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే కెరీర్ పీక్ లో ఉన్నపుడు వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయి విడి విడిగా సినిమాలు చేసుకున్నారు. రాజ్ విడిగా ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’, ‘ప్రేమంటే ఇదేరా’ ఇలా తదితర సినిమాలకు ఆయన సంగీత దర్శకుడిగా పనిచేశారు. కొన్ని సినిమాల్లో ఆయన అతిథి పాత్రల్లో కూడా కనిపించారు. రాజ్‌ తండ్రి తోటకూర వెంకట రాజు కూడా సంగీత దర్శకులుగా పలు తెలుగు చిత్రాలకు పనిచేశారు.

 

 

Exit mobile version