Site icon Prime9

MS Dhoni: యానిమల్ ధోని వెర్షన్.. రణబీర్‌ను మించి ఉన్నాడుగా

MS Dhoni: ఒక సినిమాలో హీరో ఐకానిక్ రోల్ ను వేరే హీరో రీక్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది.. ? సరే  హీరో కాకుండా ఒక క్రికెటర్ రీక్రియేట్ చేస్తే.. ఇదుగో ఇలా ఉంటుంది. ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిన సినిమాల్లో యానిమల్ ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యానిమల్   రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎవరు ఎక్కువ ఆటిట్యూడ్ చూపించినా.. రణబీర్ తో పోల్చడం ఎక్కువ అయ్యిపోయింది.

 

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ఒక యాడ్ కోసం తన సినిమానే మళ్ళీ రీక్రియేట్ చేశాడు. అయితే ఈసారి రణబీర్ తో కాకుండా స్టార్ క్రికెటర్ ఎమ్ఎస్ ధోనీతో చేశాడు.ఎమ్ఎస్ ధోని మరియు సందీప్ రెడ్డి వంగా కలిసి ఒక ఎలక్ట్రిక్ బైక్ బ్రాండ్ అయిన EMotorad కోసం ఒక యాడ్ చేశారు. ఇందులో రణబీర్ కపూర్ పాత్రలానే ధోనీని కూడా స్టైలిష్‌గా చూపించాడు.

 

ఈ యాడ్ లో ధోని లాంగ్ హెయిర్‌తో, సినిమాటిక్ ఎంట్రీ ఇచ్చాడు. యానిమల్ సినిమాలోని ఐకానిక్ సీన్స్ ను రీక్రియేట్  చేశాడు. ఉదాహరణకు, “సునాయి దే రహా హై ముఝే, బెహరా నహీ హూఁ మైం” అనే డైలాగ్‌ను ధోని తనదైన శైలిలో చెప్పాడు.  అంటే నేను మీ మాట వినగలను.. చెవిటివాడిని కాను అని చెప్పగానే సందీప్ నా హీరో దొరికేశాడు అని చెప్తాడు.  యాడ్‌లో ధోని ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రమోట్ చేస్తూ, సందీప్ వంగాతో సరదాగా సంభాషణలు కూడా జరిపాడు.
ఇక చివరగా ధోని హెయిర్ చూపిస్తూ ఇది కాస్త ఎక్కువైపోలేదా? అని అడగగా, వంగా దానికి సినిమాటిక్ టచ్  ఇస్తూ రణబీర్ ఐకానిక్ సిగ్నేచర్ చేతితో సైగ చేసే సీన్ ను చూపించారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇది వరకు కూడా EMotorad బ్రాండ్‌ కోసం ధోని పనిచేశాడు. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి కూడా కలవడంతో మరింత హైప్ వచ్చింది.
నిజం చెప్పలంటే.. రణబీర్ లుక్ ధోనీకి బాగా సెట్ అయ్యింది. ఆ ఆటిట్యూడ్ ని కూడా ధోని చాలా బాగా చూపించాడు. ఈ యాడ్  చూసాకా నిజంగా యానిమల్ సినిమా ధోనీతో చేసి ఉంటేఇలాగే ఉండేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఫ్యూచర్ లో ధోనీతో సందీప్ ఏదైనా సినిమా తీస్తాడేమో చూడాలి.

 

Exit mobile version
Skip to toolbar