Site icon Prime9

Mohan Babu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మోహన్‌ బాబు స్పందన – నా హృదయాన్ని కలచివేసింది..

Mohan Babu React on Tirupati Stampede: తిరుపతి తొక్కసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకోవడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. తొక్కిసలాట ఘటన తమని కలిచివేస్తుందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు మోహన్‌ బాబు సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు.

“తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు టికెట్ల కోసం తిరుపతిలో కౌంటర్ల వద్దకు వెళ్ళి అక్కడ జరిగిన తొక్కిసలాటలో కొంతమంది మరణించడం నా హృదయాన్ని కలిచివేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకునే జాగ్రత్తలు, సదుపాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అయినా ఇలా జరగడం దురదృష్టకరం. గాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి కుటుంబాలకు ఆ వైకుంఠవాసుడు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రేపు జనవరి 10 వైకుంఠ ఏకదశి సందర్భంగా బుధవారం తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనకు టోకెన్లు కౌంటర్‌ని ఒపెన్‌ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. ఈ మేరకు టోకెన్ల కోసం భక్తులు బారులు తీరారు. ఈ నేపథ్యంలో అక్కడ డీఎస్పీ గేట్లు తెరవడం వల్ల ప్రజలంతా ఒక్కసారిగా ముందుకు దూసుకేళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోగా.. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 41 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మహిళలు కాగా.. ఒక పురుషుడు ఉన్నారు. గాయపడిన వారు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version