Site icon Prime9

Miss Shetty MR polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ పై రాంచరణ్ కామెంట్.. అదిరిపోయే రిప్లే ఇచ్చిన జాతిరత్నం

Miss Shetty MR polishetty

Miss Shetty MR polishetty

Miss Shetty MR polishetty: దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ ఇటీవల విడుదలై తెగ నవ్వులు పూయిస్తోంది. స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా తన కామెడీ టైమింగ్‌తో నవీన్ పొలిశెట్టి ఆకట్టుకోగా.. అన్విత ర‌వళి అనే చెఫ్ పాత్ర‌లో అనుష్క డైలాగులతో అలరిస్తోంది. ఈ టీజర్‌పై పలువురు సినీ ప్రముఖులు ట్వీట్‌ చేసి చిత్ర టీమ్ కు అభినందనలు తెలిపారు. తాజాగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్ పై ట్వీట్‌ చేశారు. రాంచరణ్ ట్వీట్ కి నవీన్‌ పొలిశెట్టి అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

 

 

రీఫ్రెషింగ్ గా అనిపించింది..(Miss Shetty MR polishetty)

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌ చూశాను. చాలా కొత్తగా ఉంది.. రీఫ్రెషింగ్ గా అనిపించింది. చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు’ అని రాంచరణ్ ట్వీట్‌ చేశాడు. అయితే.. రాం చరణ్ ట్వీట్ కు నవీన్‌ పొలిశెట్టి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ‘మీ ట్వీట్‌ చూసి మాకు తెలియకుండానే నాటు నాటు స్టెప్‌ వేస్తున్నాం. సినిమా సెలెక్షన్ లో మీ నిర్ణయాలతో ‘గేమ్‌ ఛేంజర్‌’ అనిపించుకున్నారు. ఇలాంటి విషయాల్లో మాకు స్పూర్తిగా ఉన్నందుకు థ్యాంక్యూ రామ్‌ చరణ్’ అని సమాధానం ఇచ్చాడు. అనుష్క కూడా రామ్‌ చరణ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ట్వీట్ చేసింది. ఉపాసనతో కలిసి సినిమా చూడాలని కోరింది. కాగా ఇటీవల ఈ టీజర్ పై ప్రభాస్‌ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. టీజర్‌ ఎంతో ఎంటర్ టైనింగ్ గా ఉందని.. మూవీ యూనిట్ కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. మహేష్‌బాబు. పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలవుతోంది.

ఇక అనుష్క చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్‌ మీద కనిపించనుండటంతో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘బాహుబలి-2’ తర్వాత అనుష్క కేవలం ‘భాగమతి’, ‘నిశ్శబ్దం’లతో మాత్రమే కనిపించింది.

 

Miss Shetty Mr Polishetty (Telugu) Teaser | Anushka Shetty | Naveen Polishetty | Mahesh Babu P

Exit mobile version
Skip to toolbar