Site icon Prime9

Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మరో టాలీవుడ్ హీరోయిన్

Megha Akash

Megha Akash

Megha Akash: హీరో నితిన్ ‘లై’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది చెన్నై చిన్నది మేఘా ఆకాశ్. ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు కు చెందిన ఓ పొలిటీషియన్ కుమారుడితో మేఘా కొంత కాలంగా ప్రేమలో ఉందనే టాక్ ఉన్నట్టు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని కోలీవుడ్ లో అనుకుంటున్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఎంగేజ్ మెంట్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే పెళ్లి వార్తలపై మేఘా ఆకాష్ వైపు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరి పెళ్లి వార్తలు నిజమా? పుకార్లా? అనేది మేఘాగానీ, ఆమె టీమ్ గానీ రియాక్ట్ అవుతుందేమో చూడాలి.

‘లై’ తో నటిగా పరిచయమై( Megha Akash)

నటనపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ లో అడుగుపెట్టింది మేఘా ఆకాశ్‌ . ‘లై’తో ఆమె నటిగా పరిచయమై.. ‘ఛల్‌ మోహన్‌రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్‌ మేఘ’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘ప్రేమదేశం’, ‘రావణాసుర’ లాంటి చిత్రాల్లో నటించింది. తాజాగా మేఘా కీలకపాత్రలో నటించిన ‘బూ’సినిమా ఇటీవల జియో సినిమాలో విడుదలైంది. అదే విధంగా శివ కందుకూరి నటిస్తున్న మను చరిత్రలో కూడా లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తోంది.

 

 

ఈ నెల 9న వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్

మరో వైపు గత కొద్ది రోజులుగా మెగా హీరో వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు అని వార్తలు కోడై కూస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ ఓ కార్డ్‌ను పలువురు ప్రముఖులు నెట్టింట షేర్‌ చేస్తున్నారు. ఈ నెల 9న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరగనుందని సమాచారం. బంధుమిత్రులతో పాటు కొంతమంది సెలబ్రిటీల సమక్షంలో నిశ్చిత్తారం జరుగుతుందని తెలుస్తోంది.పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

 

Exit mobile version