Site icon Prime9

Megastar Chiranjeevi : సుమన్ కి స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.. రీజన్ అదేనా!

megastar chiranjeevi wishing actor suman about completing 45 years in industry

megastar chiranjeevi wishing actor suman about completing 45 years in industry

Megastar Chiranjeevi :  హీరో సుమన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తమిళ సినిమా ‘నీచల్‌ కులమ్‌’తో వెండితెరకు పరిచయమైన సుమన్‌.. ‘ఇద్దరు కిలాడీలు’ సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన సుమన్.. 90ల్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయన కేవలం యాక్షన్ సినిమాలకే పరిమితం కాకుండా సోషల్, ఫ్యామిలీ జానర్ మూవీస్‌లోనూ నటించారు. ‘నేటి భారతం’, ‘సితార’, ‘బావ బావమరిది’ తదితర విభిన్న కథా చిత్రాలు ఆయనకి స్టార్‌డమ్ తీసుకొచ్చాయి. ఆ తరవాత పలు కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన సుమన్.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక హీరోగానే కాకుండా.. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గాను తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ‘అన్నమయ్య’ సినిమాలో శ్రీవేంకటేశ్వరుడి పాత్ర సుమన్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. ఇక రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించారు.

సుమన్ @45 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ..

కాగా ఒకప్పుడు స్టార్ హీరోగా అభిమానులను సంపాదించిన హీరో సుమన్.. ఆ తరవాత ఎదురైన కొన్ని ఒడిదుడుకులు కారణంగా కెరీర్‌ లో వెనుకబడ్డారు. అయినప్పటికీ ఆయన ఎక్కడా కుంగిపోకుండా.. ఆ తర్వాత నుంచి హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా రాణించారు. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 45 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సుమన్‌కు అభినందనలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో సుమన్‌పై చిరు ప్రశంసలు కురిపించారు.

ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ.. నమస్తే మై డియర్‌ బ్రదర్‌ సుమన్‌.. ఈ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా నువ్వు 45 ఏళ్లు పూర్తి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. 10 భాషల్లో మీరు సుమారు 700 చిత్రాల్లో నటించారు. ఇది కచ్చితంగా ఒక అద్భుతమైన విజయం. ఒక వైవిధ్యమైన నటుడిగా మీకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ఈ సందర్భంగా నేను మీకు అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగే మరిన్ని సంవత్సరాలు మీరు ఒక నటుడిగా లక్షలాది ప్రేక్షకులను, మీ అభిమానులను అలరిస్తారని ఆశిస్తున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. మీరు సినిమా ఇండస్ట్రీలో 45 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈనెల 16న మంగళూరులో నిర్వహించే వేడుక విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు. జైహింద్’’ చిరంజీవి తన వీడియో మెసేజ్‌లో వెల్లడించారు.

 

 

 

గతంలో సుమన్ కెరీర్‌ను చిరంజీవే తొక్కేశారని.. తనకు గట్టి పోటీని ఇస్తున్న సుమన్‌ను ఎదగనివ్వకుండా కుట్రలు పన్నారని గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే, అవన్నీ వట్టి పుకార్లని సుమన్ ఇప్పటికే కొట్టిపారేశారు. తనను మోసం చేసినవాళ్లు వేరే ఉన్నారని.. తాను మోసపోవడం వెనుక తన తప్పు కూడా ఉందని సుమన్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. చిరు కూడా ఇదే విషయంపై పలుసార్లు ఓపెన్ అయ్యి ఆ మాటలని ఖండించారు. ఇక ఇప్పుడు సుమన్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని మరోసారి చిరంజీవి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version