Site icon Prime9

Megastar Chiranjeevi : నెక్స్ట్ లెవెల్లో అభిమానాన్ని చాటుకున్న మెగా ఫ్యాన్స్.. గూగుల్ మ్యాప్స్ పై !

Megastar Chiranjeevi fans special gift for bhola shankar release

Megastar Chiranjeevi fans special gift for bhola shankar release

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “భోళా శంకర్”. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ తరుణం లోనే మెగాస్టార్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.

ఏకంగా గూగుల్ మ్యాప్స్‌లోనే ఆయన చిత్రాన్ని గీసి వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. గూగుల్ కెక్కిన మెగాభిమానం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. హైదరాబాద్ నగరం గూగుల్ మ్యాప్‌పై మెగాస్టార్ చిత్రాన్ని గీసేందుకు మెగాభిమానులు కొందరు రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నారు. మొత్తం 800 కిలోమీటర్ల చెక్‌ పాయింట్స్‌ పెట్టుకుని జీపీఎస్‌ నావిగేషన్‌తో వాటిని కలుపుతూ చిరు బొమ్మను గూగుల్‌ మ్యాప్స్‌పై కనిపించేలా చేశారు. దీన్ని పర్ఫెక్ట్‌గా జీపీఎస్‌ వర్చువల్‌గా గీశారు. ఈ ఫీట్‌ కోసం 15 రోజులు గ్రౌండ్‌ వర్క్‌ చేసి మరీ చిరంజీవికి ‍అద్భుత కానుకనిచ్చారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భోళాశంకర్ మేనియా కొనసాగుతుంది.మొదటి షో నుంచే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version