Prime9

Manchu Vishnu about Father: నా ‘కన్నప్ప’ మా నాన్న.. ఆయన త్యాగాల ఫలితమే..

Manchu Vishnu Shared Video on My Kannappa Story: మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. మైథలాజికల్‌ మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అగ్ర నటీనటులంత ఈ సినిమాలో భాగమయ్యార. ప్రభాస్‌, అక్షయ్‌ కుమార్‌, మోహన్‌ లాల్‌, కాజల్‌ అగర్వాల్‌తో వంటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తుననారు. పలు వాయిదాల అనంతరం ఈ సినిమా జూన్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది.

 

ఇక రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో మంచు విష్ణు, మోహన్‌ బాబు ప్రమోషన్స్‌ జోరు పెంచారు. ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరులో ప్రమోషన్స్‌ చేశారు. మరోవైపు విష్ణు వరుస ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మై కన్నప్ప స్టోరీ అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. ఇందులో తన తండ్రి మోహన్‌ బాబు గురించి చెప్పుకొచ్చాడు. “కన్నప్ప మహాశివుడికి పెద్ద భక్తులు. ఒకసారి కన్నప్పు ఆయన పరీక్షించగా.. తన రెండు కళ్లను శివయ్యకు అర్పించాడు. తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. అలా ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ ఓ కన్నప్ప ఉంటాడు. మనకోసం సర్వం ధారపోసేవాళ్లున్నారు.

 

వాళ్లలో ఎవరైనా కావచ్చు. మన అమ్మ, నాన్న, అక్క, చెల్లి, భార్య, పిల్లలు, స్నేహితులు. వాళ్లలో ఎవరైనా కావచ్చు. అలాగే నా జీవితంలోనూ ఓ కన్నప్ప ఉన్నారు. ఆయనే మా నాన్న (మోహన్‌ బాబు). ఆయన మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. మా కోసం ఎంతో కష్టపడ్డారు. మా కోసం ఆయన తన జీవితాన్నే ధారపోశారు. ఈరోజు మీ ముందు ఇలా నటుడిగా కూర్చోని మీతో మాట్లాడుతున్నానంటే.. అది ఆయన త్యాగాల ఫలితమే. ఆయన కష్టపడి నటుడిగా నిలదొక్కకోవడం వల్లే.. ఈ రోజు నేను ఇలా మీ ముందు కూర్చున్నాను. ఆయనే నా హీరో. నా కన్నప్ప. అలా మీ జీవితాల్లోనూ ఓ హీరో ఉంటాడు. అది మాతో పంచుకోండి. నేరుగా మెసేజ్‌ చేయండి. మీ కన్నప్ప స్టోరీ మేము ప్రపంచానికి చెబుతాం” అంటూ చెప్పుకొచ్చాడు.

 

 

Exit mobile version
Skip to toolbar