Prime9

Kannappa Trailer Out: ‘కన్నప్ప’ ట్రైలర్‌ వచ్చేసిందోచ్‌.. రుద్రగా ప్రభాస్‌ రోల్.. ఫ్యాన్స్‌కి గూస్‌బంప్సే..!

Manchu Vishnu’s Kannappa Official Trailer in Telugu Out Now: మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. మైథాలాజికల్‌ ఫాంటసి డ్రామా రూపొందుతున్న ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మొదట ట్రోల్స్‌ ఎదుర్కొన్న ఈ సినిమాకు శివ శివ పాటతో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఈ క్రమంలో ట్రైలర్‌పై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

 

ట్రైలర్‌తో ఈ సినిమా ఎలా ఉంటుందో తేల్చేయచ్చని ఎదురుచూస్తున్నారు ట్రోలర్స్. ఈ క్రమంలో కన్నప్ప ట్రైలర్‌పై ఆసక్తి నెలకొంది. ఇక ఆడియన్స్ ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న ‘కన్నప్ప’ ట్రైలర్‌ వచ్చేసింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ అందరి అంచనాలు తలకిందులు చేసినట్టే అనిపిస్తోంది. ఇందులో విష్ణు ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించాడు. ఇక రుద్రగా ప్రభాస్‌ రోల్‌ ట్రైలర్‌కే హైలెట్‌ అని చెప్పాలి. ట్రైలర్‌తో మూవీపై మీమ్స్‌, ట్రోల్స్‌ చేయొచ్చని ఆసక్తిగా ఉన్న ట్రోలర్స్.. నిరాశ ఎదురైందని చెప్పాలి. మొత్తానికి దైవభక్తి, సీరియస్ యాక్షన్ సీక్వెన్స్‌తో కన్నప్ప ట్రైలర్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది.

 

మొదటి నుంచి చివరి వరకు భక్తి భావంతో ఈ ట్రైలర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. మొత్తానికి కన్నప్ప ట్రైలర్‌ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ముకేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌, బ్రహ్మనందం వంటి అగ్ర నటులు భాగం అయ్యారు. అవా ఎంటర్‌టైన్స్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లో మోహన్‌ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో విష్ణు సరసన ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ నెల 27న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.

 

Kannappa Official Trailer- Telugu | Vishnu Manchu | Mohan Babu | Prabhas | Mohanlal | Akshay Kumar

 

Exit mobile version
Skip to toolbar