Prime9

Rajinikanth Watched Kannappa: ‘కన్నప్ప’ చూసిన తర్వాత రజనీకాంత్‌ రియాక్షన్‌ ఇదే.. మంచు విష్ణు ఎమోషనల్‌!

Rajinikanth Watched Manchu Vishnu Kannappa Movie: కన్నప్ప టీం ప్రస్తుతం ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ మూవీని ప్రమోట్‌ చేస్తున్నారు మంచు విష్ణు, ఆయన తండ్రి, నటుడు మోహన్‌ బాబు. జూన్‌ 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్‌ రిలీజ్ చేసింది మూవీ టీం. ఇది ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చూశారు. కన్నప్ప చూసిన అనంతరం ఆయన స్పందించిన తీరును వివరిస్తూ హీరో మంచు విష్ణు ఎమోషనల్‌ అయ్యాడు.

 

ఈ సందర్భంగా రజనీతో దిగిన ఫోటోని షేర్‌ చేశాడు. కన్నప్ప చూసిన అనంతరం రజనీ అంకుల్‌ నాకు గట్టిగా ఆలింగనం చేసుకున్నాడంటూ విష్ణు చెప్పుకొచ్చాడు. “గత రాత్రి రజనీకాంత్‌ అంకుల్‌ కన్నప్ప మూవీ చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు. నా దగ్గరికి వచ్చిన ఆయన ప్రేమతో గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. కన్నప్ప ఆయనకు బాగా నచ్చిందంటూ ప్రశంసించారు. ఓ నటుడిగా ఈ మూమెంట్‌ కోసం 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా. ఈ రోజు నేను గొప్ప అనుభూతిని పొందాను.

 

జూన్‌ 27న కన్నప్ప మూవీ విడుదల కానుంది. ఆ రోజు ఆ పరమ శివుడి మ్యాజిక్‌ ప్రతి ఒక్కరు ఫీల్‌ అవ్వడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ విష్ణు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే మోహన్‌ బాబు ఇదే విషయాన్ని ఎక్స్‌ వేదిగా షేర్‌ చేశారు. రజనీకాంత్‌, మోహన్‌ బాబులు తల్లిదండ్రులుగా నటించిన పెద్దరాయుడు మూవీ విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మోహన్‌ బాబు రజనీని కలిశారు. ఇదే విషయాన్ని ఆయన షేర్‌ చేసుకున్నారు.

 

 

“పెద్దరాయుడు మూవీ విడుదలైన ముప్పై ఏళ్లు. ఈ సందర్భంగా నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌, ఆయన కుటుంబంతో కలిసి కన్నప్ప మూవీ చూశాను. సినిమా చూసిన తర్వాత ఆయన చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేను. థాంక్యూ మిత్రమా” అని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్‌ దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ పతాకాలపై మోహన్‌ బాబు ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

 

Exit mobile version
Skip to toolbar