Manchu Manoj : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు మంచు మనోజ్. విభిన్న చిత్రాలతో వైవిధ్యభరిత చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే ఇటీవల కాలంలో మంచు మనోజ్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచారు. ఒకవైపు తన పర్సనల్ లైఫ్, మరోవైపు ఫిల్మ్ కెరీర్ కి సంబంధించి మీడియాలో వార్తలతో ట్రెండింగ్ లో ఉంటూ వచ్చారు. ఇక ఇటీవలే మళ్ళీ ఒక ఇంటి వాడైన మనోజ్ ఇక సినిమాలను వరుసగా పట్టాలెక్కిస్తున్నాడు.
దాదాపు 6 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వనున్నాడు ఈ యంగ్ హీరో. 2017 ఒక్కడు మిగిలాడు సినిమా తరువాత మంచు మనోజ్ హీరోగా మరో సినిమాలో కనిపించలేదు. 2018 లో రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఆ తరువాత 2020 లో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాని రామ్ చరణ్ చేతులు మీదుగా చాలా గ్రాండ్ గా లాంచ్ చేసి.. దానిని మధ్యలోనే పలు కారణాల రీత్యా వదిలేశారని సమాచారం అందుతుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మనోజ్.. ఇటీవలే మళ్ళీ వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. ఇక నిన్న ( మే 20 ) మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యాన్స్ రెండు గిఫ్ట్ లు ఇచ్చి సర్ ప్రైజ్ చేశాడు.
“వాట్ ది ఫిష్” ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ (Manchu Manoj)..
ఇప్పటికే వాట్ ది ఫిష్ అనే సినిమాని మనోజ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. విశాల్ అండ్ సూర్య బెజవాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ మరియు నటీనటులు గురించి అప్డేట్ రావాల్సి ఉంది. కాగా తాజాగా మనోజ్ బర్త్ డే ని పురస్కరించుకొని ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ లో గేమింగ్, డ్రగ్స్ వంటి సీన్స్ చూపించారు. అలాగే మనోజ్ ని కూడా గుడ్ అండ్ బ్యాడ్ లుక్స్ లో చూపించారు. ఇక ఈ గ్లింప్స్ కి మనోజ్.. ‘భయం కొత్త రూపాన్ని తీసుకుంది’ అంటూ కామెంట్ రాసుకు రావడంతో ఈ మూవీ కూడా ఒక కొత్త జానర్ లో తెరకెక్కుతోందని అర్ధమవుతుంది.
𝚃𝚑𝚎 𝚃𝚎𝚛𝚛𝚘𝚛 𝚝𝚊𝚔𝚎𝚜 𝚊 𝙽𝚎𝚠 𝙵𝚊𝚌𝚎 🎭
Here’s the First Look Glimpse of #WhatTheFish 💥
▶️ https://t.co/xL8BE9aTXw@afilmbyv 🎥#Varun @6ixCinemas #MM #AfilmbyV pic.twitter.com/jQp1PKjBdZ
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 20, 2023
కొత్త సినిమా స్టార్ట్..
భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు మంచు మనోజ్. మమత సమర్పణలో ఎం శ్రీనివాసులు, డి వేణు గోపాల్, ఎం మమత, ముల్లపూడి రాజేశ్వరి సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మనోజ్ కెరీర్ లోనే ఇది ఒక కొత్త కథతో రాబోతుందని మేకర్స్ తెలియజేశారు. మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామంటూ నిర్మాతలు వెల్లడించారు.