Site icon Prime9

Manchu Manoj: చంద్రగిరి పోలీసుల స్టేషన్ కు వెళ్లిన మనోజ్

Manchu Manoj Went Chandragiri Police Station: సినీ నటుడు మంచు మనోజ్ పోలీసులు స్టేషన్ కు వెళ్లాడు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో గురువారం చంద్రగిరి పోలీసులు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ జరిగిన వివాదంపై ఆయన ఫిర్యాదు చేశారు . తనపై, తన భార్య మౌనికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనని ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు మనోజ్ కి సూచించారు.

కాగా సంక్రాంతి సందర్భంగా మనోజ్ తన కుటుంబంతో కలిసి పెద్దలకు నివాళులు అర్పించేందుకు బుధవారం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లారు. అయితే లోపలికి వెళ్లేందుకు ఆయనను అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తన తాతయ్య, నానమ్మల సమాధులను దర్శించుకునేందుకు ఎవరి అనుమతి కావాలి? అని పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఆదేశాల మేరకు తనకు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని, తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారు.

అనంతరం భారీ బందోబస్తు మధ్య మనోజ్ తన తాత,నానమ్మ సమాధులు దర్శించి నివాళులు అర్పించాడు. ఈ క్రమంలో విష్ణు బౌన్సర్లకు, మనోజ్ బౌన్సర్లకు మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపు చేయడంతో వాగ్వాదం సద్దుమణిగింది. కాగా గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం ఆస్తి వివాదాలు, అంతర్గత కలహాలతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మోహన్ బాబు, మనోజ్ లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. అలాగే తన అన్నయ్య విష్ణు వల్ల తనకు ప్రాణహానీ ఉందని మనోజ్ రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Exit mobile version