Manchu Manoj : మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కాగా వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు.. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో ఈ జంట బయట కనపడ్డారు. తాజాగా ఈ జంట మొదటిసారి ఒక టీవీ షోకి వచ్చారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో వెన్నెల కిషోర్ హోస్ట్ గా అలా మొదలైంది అనే షో ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ షో లో పలువురు సెలబ్రిటీలు పాల్గొంటుండగా.. వాళ్ళని వెన్నెల కిషోర్ తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీ జంటలు ఈ షోకి రాగా సరదాగా సాగుతుంది ఈ షో.
తాజాగా వెన్నెల కిషోర్ షోకు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మంచు మనోజ్, వెన్నెల కిషోర్ మంచి స్నేహితులు. దీంతో షోకి కిషోర్ పర్సనల్ గా పిలవడంతో మనోజ్ తన భార్యతో కలిసి వచ్చినట్టు సమాచారం. మనోజ్ పెళ్లి వార్తల్లో బాగా హైలెట్ అయింది. దీంతో ఈ జంట ఇలా టీవీ షోకి రావడంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలా మొదలైంది మనోజ్ మౌనిక ప్రోమోని రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూశాక ఎపిసోడ్ లో వీరు అనేక విషయాలు, వీరి ప్రేమ గురించి, గొడవల గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది.
ప్రోమోలోనే మనోజ్.. మౌనికను మంచు మనోజ్ ఎప్పుడు కలుసుకుందనే విషయంతో పాటు ఇద్దరిలో తానే రొమాంటిక్ అని చెప్పారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణల గురించిన చర్చ కూడా జరిగింది. మౌనిక మంచి రచయిత కూడా అని అదే సందర్భంలో మనోజ్ ఆమె గురించిన సీక్రెట్‌ను రివీల్ చేశారు. ఇన్ని రోజులు మనోజ్‌గారికి కోపమెక్కువ ఎలా డీల్ చేస్తారోనని అందరూ అనుకున్నారు. కానీ.. ఇప్పుడు మనోజ్‌గారు నా కోపాన్ని డీల్ చేస్తున్నారని చెప్పటం కొస మెరుపు. దీనికి మనోజ్ కూడా రియాక్ట్ అవుతూ తనెందకు వైల్డ్ కాదనుకుంటున్నారు. నన్ను అడగండి చెప్తా అని కామెడీ యాంగిల్‌లో సతీమణికి సంబంధించిన విషయాన్ని రివీల్ చేశారు.
నేను బ్రతికి కూడా వేస్ట్ ఈ జన్మకి – మనోజ్ Manchu Manoj
ఇక తమ ప్రేమ ప్రయాణంలో ఎమోషనల్ కోణాన్ని కూడా మనోజ్, మౌనికలు చెప్పారు. ఈ క్రమంలో ఉప్పెన సినిమాలో ‘ఈశ్వర సాంగ్ ఐదు నిమిషాలుంటే మా లైఫ్‌లో సంవత్సరాలుండింది. మేం దేశ దేశాలు, ఊర్లు తిరుగుతూ ఉండినాం’ అని మనోజ్ పెళ్లికి ముందు ఏం చేశామని విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అలాగే మౌనిక భావోద్వేగ జర్నీగురించి మాట్లాడుతూ ‘‘‘అమ్మ చనిపోయిన తర్వాత బర్త్ డే రోజున అలా ఆకాశం చూస్తూ ఎక్కడున్నావ్.. నాకేం కావాలో నీకు తెలుసు..అంతా నీకే వదిలేస్తున్నాను’ అని అనుకున్నాను. మనోజ్ ఆరోజు ఆళ్లగడ్డకి రాడేమోనని అనుకున్నాను. నా జీవితంలో నేను అది మరచిపోలేను’’ అని ఎమోషనల్ అయ్యారు.
‘‘నేను వెళ్లాలి. అక్కడే ఉండాలి అని మనమే ఊహించేసుకుని, నేను అక్కడికి వెళ్లి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడ్డాను. మనం అనుకున్నట్లే ప్రేమించాం. ప్రేమ అనేది రెండు పక్కలా ఉండాలి. ఎటు పక్క నిలబడుతున్నానో, ఎక్కడున్నారో ఏం అర్థం కాలేదు. సరే నీకు లవ్ లైఫ్ కావాలా, సినిమా కావాలా సెలక్ట్ చేసుకో అనే పరిస్థితి కూడా క్రియేట్ అయ్యింది. మనల్ని నమ్ముకుని బిడ్డంతో ఓ అమ్మాయి లైఫ్ నిలబడింది నా కోసం. నేను బ్రతికి కూడా వేస్ట్ ఈ జన్మకి.. ఎన్ని డోర్లు మూస్తారో మూయండి’’ అని మనోజ్ అన్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ఫుల్ ఎపిసోడ్ ఏప్రిల్ 18న టెలికాస్ట్ కానుంది.