Site icon Prime9

Manoj Compliant on Manchu Vishnu: నా ఇంట్లో దూరి విష్ణు దొంగతనం చేసాడు.. మరోసారి పోలీసులను ఆశ్రయించిన మనోజ్!

manchu family issues

manchu family issues

Manchu Manoj Complaints against Manchu Vishnu: ఆస్తి తగాదాల్లో మంచు ఫ్యామిలీ రోడ్డున పడిన విషయం తెల్సిందే.  గత కొన్నిరోజులుగా మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.  మరోసారి  మంచు ఇంట గొడవలు  తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మోహన్ బాబు.. మనోజ్ పై ఫిర్యాదు ఇవ్వడంతో  ఈ సమస్య బయట పడింది. ఆ తరువాత మనోజ్.. మోహన్ బాబుఓయూ ఫిర్యాదు చేశాడు. అనంతరం మంచు విష్ణుపై కూడా ఫిర్యాదు చేశాడు.

 

తన అన్న మంచు విష్ణు.. తనను, తన కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు తెలిపాడు. తన తల్లి పుట్టినరోజు వేడుకల కోసమని ఇంటికి వచ్చి జనరేటర్ లో షుగర్ వేసి.. కరెంట్ పోయేలా చేసి చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగోలా తాము తప్పించుకున్నామని పోలీసులకు తెలిపాడు.

 

ఇక మధ్యలో కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న విష్ణు.. మరోసారి తమ్ముడి ఇంటిపై దాడికి దిగాడు.  తాజాగా మనోజ్ పోలీసులను మరోసారి ఆశ్రయించాడు. ఈ మధ్యనే మంచు మనోజ్ కుటుంబం.. తన కూతురు దేవసేన పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లారు. మనోజ్ ఇంట్లో లేడని తెలిసి..  విష్ణు 150 మందితో కలిసి జల్ పల్లిలో  ఉన్న ఇంటికి వెళ్లి దొంగతనానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

 

“నేను నా కుటుంబంతో సహా రాజస్థాన్ వెళ్లానని తెలుసుకున్న విష్ణు.. నా ఇంటికి 150 మంది వ్యక్తులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఇల్లు మొత్తాన్ని చిందరవందర చేశాడు. ఇంట్లో విలువైన వస్తువులను, కార్లను దొంగతనం చేశాడు. నా కార్లు.. విష్ణు ఆఫీస్ వద్ద దొరికాయి. గోడలు దూకి ఇంట్లోకి వచ్చి.. ఇవన్నీ చేశారు.

 

ఈ గొడవలను ఇక్కడితో ఆపడానికి నేను మా  నాన్నతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ, ఆయన నాతో మాట్లాడడానికి ఒప్పుకోలేదు. నా ఇంట్లో జరిగిన ఈ విధ్వంసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాను. మా కుటుంబానికి, నాకు.. విష్ణు నుంచి ప్రాణ హానీ ఉంది. దయచేసి మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను” అని మనోజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మనోజ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

 

ఇక మంచు బ్రదర్స్ కెరీర్ నుంచి చెప్పలాంటే.. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. మోహన్ బాబు ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మంచు మనోజ్.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెల్సిందే. భూమా మౌనికను  రెండో పెళ్లి చేసుకున్నాకా.. మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం మనోజ్ భైరవం, మిరాయ్ లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

 

Exit mobile version
Skip to toolbar