Manchu Manoj Birthday Wishes Mohan Babu: విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు నేడు. మార్చి 19తో ఆయన 73వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో వేదికగా విషెస్ వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తండ్రి పుట్టిన రోజు సందర్భంగా హీరో మంచు మనోజ్ స్పెషల్ పోస్ట్ షేర్ చేశాడు.
ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా..
తండ్రికి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతూ ఆయన సినిమాలకు సంబంధించిన ఫోటోలతో పాటు, మోహన్ బాబు ఫోటో ముందు తన కూతురు నిలుచుని ఉన్న ఫోటోని షేర్ చేశాడు. ఈ సందర్భంగా మిస్ అవుతున్న నాన్నా అంటూ మనోజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. “హ్యాపీ బర్త్‌డే నాన్నా. ఈ ప్రత్యేకమైన రోజును నీ పక్కన లేకపోడం చాలా బాధగా ఉంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మీతో మీ పక్కనే ఉండే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా అన్నింటో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అని రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా తన తండ్రి మోహన్ బాబు సినిమాల్లో తను చైల్డ్ ఆర్టిస్టుగా నటించిను మూవీ క్లిప్స్ అన్నింటిని వీడియోగా మలిచాడు. దీనికి నా సూర్యుడివి, నా చంద్రుడివి అంటూ నాన్న పాటను జోడించి తండ్రిపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు.
తండ్రికొడుకుల వివాదం..
ప్రస్తుతం మనోజ్ పోస్ట్ నెటిజన్స్ బాగా ఆకట్టుకుటుంది. కాగా గత కొంతకాలంగా మనోజ్‌కి మోహన్ బాబు మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. తండ్రికొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంతేకాదు తన ఇంటిని కొందరు ఆక్రమించారని, వెంటనే వారి ఖాళీ చేయించి తన ఆస్తులు తనకు అప్పగించాలని మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్‌కి ఫిర్యాదు చేశాడు. మరోవైపు పెద్ద కొడుకు విష్ణుతో కలిసి ఉంటు మనోజ్‌ని మోహన్ బాబు దూరం పెడుతున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ క్రమంలో మనోజ్ తండ్రి బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషల్ పోస్ట్ షేర్ చేశాడు. మరి దీనిపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.