Site icon Prime9

Director Shafi: సినీ పరిశ్రమలో విషాదం – ప్రముఖ దర్శకుడు షఫీ కన్నుమూత

Director Shafi Passed Away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ డైరెక్టర్‌ షఫీ (56) ఆదివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 16న ఆయనకు హార్ట్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువేళ్లారు. వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స అందించారు. అయితే పరిస్థితి మెరుగు పడకపోవడంతో గత పది రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ జనవరి 26న మృతి చెందారు.

ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేస్తున్నారు. మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌, తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌లు ఆయన సోషల్‌ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. విక్రమ్‌ ట్వీట్‌ చేస్తూ.. “ఈరోజు ఉదయం ప్రియమైన మిత్రుడిని కోల్పోయాను. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన దర్శకుడిని కోల్పోయింది. నేను చూసిన అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. జీవితంలో ఎలాంటి క్షణాన్ని అయినా అందంగా చూడగల వ్యక్తి, అతను మన మధ్య లేకపోవచ్చు, కానీ.. ఆయనతో ఉన్న క్షణాలు ఎల్లప్పుడూ గుర్తుగా ఉండిపోతాయి.

మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతున్నా. కానీ ఎప్పటికీ మర్చిపోలేను” అని రాసుకొచ్చాడు. కాగా షిఫీ అసలు పేరు రషిద్‌. సినిమాల్లోకి వచ్చాక ఆయన షఫీ పేరుగా గుర్తింపు పొందారు. 2001లో వన్‌ మ్యాన్‌ షో చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత రెండు దశాబ్దాలుగా ఆయన దర్శకుడి రాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 10కి పైగా చిత్రాలను తెరకెక్కించి స్టార్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. వినోదాత్మక చిత్రాలకు ఆయన కేరాఫ్‌గా నిలిచారు.

Exit mobile version