Site icon Prime9

Malaika Arora : అతని వల్లే ఈరోజు ఇలా ఉన్నానంటున్న మలైకా అరోరా..!

malaika-arora-interesting-words-about-her-ex-husband

malaika-arora-interesting-words-about-her-ex-husband

Malaika Arora : బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ” మలైకా అరోరా “. హిందీలో పలు సినిమాలతో మాత్రమే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మలైకా. 40 ఏళ్ల వయస్సులో కూడా తగ్గేదే లే అంటూ ఫిజిక్ విషయంలో యూత్ కి పోటీ ఇస్తుంటుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ నటి సుపరిచితురాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసి టాలీవుడ్ లో కుడా మంచి క్రేజ్ పొందింది. కానీ ఆ తర్వాత తెలుగులో మళ్ళీ ఏ సినిమాలోనే మలైక నటించలేదు.

కేవలం సినిమాల పరంగానే కాకుండా ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది ఈ భామ. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో తన దాంపత్య బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల ముందు , విడాకుల తర్వాత కూడా నిత్యం ఈమె గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో తన ప్రియుడు అర్జున్ కపూర్‏తో త్వరలోనే ఏడడుగులు వేయనుందని… ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు వస్తుండడం పట్ల మలైక స్పందించింది.

తాజాగా ఓ షోలో పాల్గొన్న మలైక తన మాజీ భర్త గురించి మనసులో మాటల్ని బయట పెట్టింది. ఈ మేరకు జీవితంలో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే తాము విడిపోయినట్లు తెలిపింది. అర్బాజ్ తనను ఓ వ్యక్తిగా మార్చాడని, అతని వల్లే ఈరోజు ఇలా ఉన్నానని తెలిపింది. అలాగే ఇటీవల తనకు జరిగిన ప్రమాదం గురించి చెబుతూ ఆ సమయంలో నేను నా పిల్లలను చూడలేనని అనుకున్నాను. కానీ కొన్ని గంటల్లో స్పృహలోకి వచ్చానని… అప్పుడు తన కళ్ల ముందు ఉన్న వ్యక్తి అర్బాజ్ ఏ అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version